ఈ బ్లాగు మూసివెయ్యబడింది.
మాష్టారు! ఇంకా ఇక్కడేం పీకుతున్నారు ? ఈ బ్లాగుని మూసేసి, నా వెబ్ పేజ్ లొ పెట్టెసుకున్నా. ఈ కింద లింక్ పట్టుకుని, అక్కడికి వచ్చెయండహే, కుమ్మేసుకుందాం!
http://naagas.g33k.in/blog

కారణం: బ్లాగర్ లొ కస్టమైజేషన్ కుదరటంలేదు. అదే సొంత సైట్ అయ్యితే, ఏది కావలంటే అది గెలుక్కొవచ్చు. :D
స్పందించిన దేవత - 1
ఎదో అలికిడి అయ్యినట్టు వినిపించింది. మనకి పట్టపగలు, ఏ పనిలో లేనప్పుడు కూడా అలికిడి శబ్దాలు వినిపించవు మాములుగా, నిద్రలో బిజిగా వున్నప్పుడు వినపడటమేంటో అర్ధం కాక, అయోమయంగా కళ్ళు తెరిచా. నా లాప్ టాప్ నేను నిద్రపోయయని తెలియక, సినిమా మెత్తం ప్లే చేసి యెర్రిచూపులు చూస్తొంది. నా రూమ్మేట్ స్వప్నాల వెంట పరిగెడుతూ, గురకలు పెడుతున్నాడు. బహుశా పరిగెత్తి పరిగెత్తి, రొప్పు వస్తోందేమో. మొదట్లొ, నిద్రపట్టేది కాదు కాని, వాడి గురక ఇప్పుడు బాగా అలవాటయ్యిపోయింది. నా నిద్రాభంగానికి కారణం ఖచ్చితంగా వీడు కాదు. అలికిడి నాకు వినిపించలేదు, అనిపించింది అని నిర్ధారణ చేసుకుని, సెల్ఫోన్ లో టైం చూశా.. అర్ధరాత్రి 3:30 (అవును, అది నాకు ప్రాత:కాలం కాదు, అర్ధరాత్రే) అయ్యింది. నేను ఇంటర్ చదివే రోజుల్లొ, 7 అయ్యినా నిద్రలేవటం లేదని, మా వార్డన్.. పొద్దునే 4 గంటలకి నిద్రలేచి చచ్చే జీవాల ఉనికి గురించి అరగంటసేపు తెలియబరిచాడు, ఇంకెప్పటికి మరిచిపోకుండా. కొంపతీసి ఆ జీవాలని కన్న తల్లిజీవం మా పొరిగింట్లొ ఆవాసం పెట్టలేదు కదా ? ఆ జీవం కాదు కదా, అర్ధరాత్రి 3:30కి ఈ అలికిడి నిర్వాకానికి కారణం ? అని పరిపరివిధాల, పెక్కురకాలగా అలోచించుకుంటూ, పొద్దునే మంచినీళ్ళు తాగటం మంచిదని చెప్పిన మంతెన సత్యన్నారయణ ప్రోగ్రాం మా నాన్నతో కలిసి చూసిన విషయం గుర్తుకు వచ్చి, బాటిల్ ఎత్తాను.. ఎం మంచి జరుగుతుందో తెలుసుకుందామని. పడుకునేప్పుడు నిండుగానేపట్టాను, ఇప్పుడేమో చుక్క కూడా లేవు. అప్పటికి అలా ఎన్నిసార్లు లేచి నీళ్ళు తాగానొ అనుకుంటూ నీళ్ళు పట్టుకొటానికి హాల్ లొకి వెళ్ళాను. మా ఇంట్లొ నిద్రపోయెముందు, దీపాలార్పెలాంటి చెడు అలావాట్లు ఎవ్వరికి లేవు, కాబట్టి తడుముకుంటూ నడిచే బాధ తప్పింది. లైట్లంటే.. సరే, ఇలాంటి పరిస్థితుల్లో పనికి వస్తాయ్, మరి ఫ్యాన్ల సంగతేంటో! నీళ్ళు పట్టుకుంటుంటే, బాల్కని తలుపు గాలికి చిన్నగా కదిలేప్పటికి అటు వైపు చూడాల్సివచ్చింది. చిక్కటి తెల్లపు రంగు ప్రకాశం, బాల్కని నిండా పరుచుకుంది. చెట్లన్ని, మెల్లగా కదులుతూ.. పిల్లలని ఆటలకిపంపే తల్లి ఎంత జాగ్రత్తగా పంపుతుందో.. అంతే జాగ్రత్తగా చల్లటి పిల్లగాలిని పంపుతున్నాయి.. "ప్రక్రుతి అహ్లదకరంగా వుంది, పద రసికా! ఆలస్యమేల?" అంది మనస్సు. "ఎహే నీ.. ఎం పనిపాట లేదా.. ఎందుకు వచ్చిన పితలాటకాలివన్ని, వెళ్ళి హాయిగా నిద్రేసుకుందాం పదా, అస్సలికే ప్రియమణి వాళ్ళ ఇంటిదాకా వెళ్ళి పలకరించకుండా వస్తే బావొదు" అని గొడవ చేసింది వయస్సు.
deadlock లో రెండు సెకెన్ల సమయపరిమితిని మీరటంవల్ల, మెదుడుకి అదీనతని ఇవ్వటం జరిగింది. ఇవ్వాళ్ళ ప్రియమణి కాకపొతే, రేపు త్రిషా వాళ్ళింటికి వెళ్ళి, కాఫి తాగొచ్చు. ఈ లైటింగ్ మళ్ళి ఇంకో నెల దాకా రాదు. అయ్యినా బాల్కని రెండడుగులే కదా అని లాజికల్ గా అలోచించింది. అందుకే బాస్సు, నిన్ను మెదడంది.. అబ్భా అబ్భా ఎంత గొప్పగా అలొచించావు. అని పొగుడుతూ శరీరవయవాలు బాల్కనిని చేరాయి.

ఎంత ప్రకాశవంతంగా వుందొ బయట.. కళ్ళు జిగేల్మన్నాయి. ఖచ్చితంగా ఇది, పౌర్ణమి వెన్నెల కాదని అర్ధమయ్యి, పరిసరాలు గమనించా. కార్ పార్కింగ్ లొంచి వస్తోంది వెలుగు. అక్కడ అపార్ట్మెంట్ బెంచ్ మీద ఎవరో అమ్మాయి ముడుచుకుని కుర్చుని వణుకుతున్నట్టు వుంది. బెంగుళుర్లో పొద్దున్నే 3:30 కి ఆరుబయట కుర్చుంటే వణుకు.. దాన్ని ఆనుకుని జలుబు, మరి ఆలస్యం చేయకుండా జ్వరం వచ్చేస్తాయి, ఆ మాత్రం తెలియదా అనిపించింది. అవునులే, అనుభవం మీద తెలుసుకోవాల్సిన విషయాలవి. అమ్మాయి మాత్రం మెరిసిపోతుంది, ఆ ప్రకాశమంతా తననుంచే వస్తుందా అన్నట్టు వుంది. మిరిమిట్లుగొల్పె తెల్లటి అనార్కలి టైపు డిజైనర్ డ్రస్సు.. దాని మీద, అంతకన్నా ఘోరంగా మెరిసిపోతూ, కొట్టొచ్చిన్నట్టు కనిపిస్తున్న వెండిరంగు దారంతో చేసిన సొగసులు.. తిరుపతి కొండ మీంచి, ఊరిని చూస్తున్న భావన. ఆ పిల్లగాలితో మేము కూడా ఆడుకుంటామని ఆమె కురులు మారాం చేస్తున్నట్టు వున్నాయి. కొంతమందిని అందంగా వున్నారని చెప్పటానికి, మెహం చూడనక్కర్లేదు. మనస్సు వారి విషయంలో ఎప్పుడు తప్పు చేయదు. ఆ కోవకి చెందిందే ఆ అమ్మాయి.
"కల కాదుగా నిజమే కదా.. నిను చూస్తున్నా"
ఎదో ఫంక్షన్ అయ్యివుంటుంది. లేకపోతే ఇంత పొద్దున్నే, ఇంత అందంగా ముస్తాబు ఏ తలకమాసిందీ అవ్వదు. ఈ అమ్మాయి కూడా మన అపార్ట్మెంట్స్ లో ఎప్పుడు తగల్లేదు, ఫంక్షన్ కి వచ్చి వుంటుంది. బహుశా, ఈ లైటింగ్ కూడా ఆ ఫంక్షన్ కి ఏర్పాటు చేసిందయ్యిండొచ్చు. అయ్యినా, 3:30కి అపార్ట్మెంట్స్ లో చేసుకునే ఫంక్షన్స్ ఎముంటాయబ్బా అనిపించింది. ఒక్కసారి, అమ్మాయిని పూర్తిగా, మెహంతో సహా చూసేసి కళాపోషణ చేశామనే త్రుప్తితొ వెళ్ళి పడుకుందామని, కాస్త పరిశీలనగా.. వంద శాతం మెలుకవ తెచ్చుకుని చూశాను. అప్పుడు అర్దమయ్యింది, తను వణకటంలేదు.. ఏడుస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది.
  • Interesting Articles

    About Me

    నా పూర్తి పేరు నాగేశ్వరరావు మన్నెం. మా నాన్న బుజ్జిగా అంటాడు. మా అమ్మేమో, బంగారుకొండ/అమ్మా అని పిలుస్తుంది. మా అక్క, బావ.. ఇంజినిరింగ్ ఫ్రెండ్స్ వచ్చెసి, నాగాస్ అంటారు. కాలేజి లొ నాగేశ్వర్ అని, ఆఫీస్ లొ నాగేశ్వరా అని, పిలిపించుకుంటా. ఇంకా కొంతమంది నాగేష్ అని, MNR అని, అబ్బాయ్ అని, ఒరేయ్ అని ఎవరికి అనుగుణంగా వాళ్ళు పిలుచుకుంటారు. మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు పిలిచుకోవచ్చు. పిలిస్తే పలుకుతా :)

    Stats


    View My Stats
  • Followers