ఈ టాపిక్ మీద ఎప్పటినుంచో ఒక బ్లాగ్ రాద్దాం అనుకుంటున్నానండి. ఇప్పటికి కుదిరింది, కాదు కాదు, రాయాలని మనసు కలిగింది. ఏదో ఒకటి ఎడిశావ్లె గాని, ఇంతకి విషయం ఏంటి అంటారా ? తినబోతూ రుచులు అడగటం ఎందుకండి. ఏదో కొట్టాలి కాబట్టి , ఆ సామెత చెప్పాను కాని , ఇప్పుడు అందరు రుచి confirm చేసుకున్నాకా కాని తినటం లేదు, అంతా five star మహిమ. అయినా, సామెతలు పాతబడిపోయాయండి. మోడరన్ సామెతలు అని చెప్పి, కొత్తవి create చేసుకోవాలి. (already వున్నాయనుకుంట. వీలు ఐతే search చేసి, links పోస్ట్ చేస్తానులెండి.)
okay, ఇంతకి సంగీతం లోకి వస్తే... రావటానికి ముందు నాకు సంగీతం లో ఏమైనా ప్రవేశం వుందేమో తెలుసుకోవాలని వుంది కదా.. అమ్మా! ఆశ, దోస, అప్పడం, వడ.. చెప్తే, బ్లాగ్ close చేసేస్తారు :P సరే, ప్రతిదానికీ ఒక prologue ఎడ్వాలని చిన్నప్పుడు మా మాష్టారు స్కేల్ తో, అరచేతి వెనకవైపు కొట్టి మరీ చెప్పారు. so, here we go. సంగీతం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరమండి. దానిని మనం సాహిత్యం తో, ఇంకా అందం గా మలుచుకున్నాం. వున్నవి "స రి గ మ ప ద ని" అని ఏడు స్వరాలు ఐనా, వాటినుంచి కోటి వినసొంపైన రాగాలని సృష్టిమ్చ్చవచ్చంటేనే, అద్భుతం గా వుంది. అంత అద్బుతం గా వున్నా సరే, నా విషయానికి వస్తే మాత్రం సాహిత్యాన్ని కూడా సమానం గా ఇష్టపడతాను, గౌరవిస్తాను. పాలు, పంచదార కలిస్తేనే కదండీ నిజమైన రుచి. అలాంటి సంగీతం సాహిత్యం కలిసి, మనల్ని మురిపించే, ఒకానొక శ్రావ్యమైన రూపం, సినిమా పాట. నాకు తెలుగు తప్పితే, వేరే భాషల పాటలు నచ్చవండి. సాహిత్యాన్ని అర్ధం చేసుకోటానికి మనకి ఆ భాషలు అంత లోతుగా రావు కదా. నేను చిన్నప్పటినుంచి, ప్రాప్తిసితే స్వీకరిస్తాను కాని, ప్రాప్తి కోసం ప్రాకులాడను, అందుకనే వేరే భాషలని ప్రత్యేకంగా నేర్చుకోలేదు. అలాగని లక్ష్యాలు ఏమి లేకుండా బతికేస్తున్నానని కాదు, తెలుగు పాటలు బాగోలేకపోతే, వేరే భాషల వైపు చూడాలి కానీ, దేవుడి దయ వల్ల మన మ్యూజిక్ directors మనకి ఆ గతి పట్టనివ్వలేదు కదా. అవసరం ఐతే, వాళ్ళ పరువు పణం గా పెట్టి మరీ, వేరే భాషల నుంచి tunes ని అరువు తెచ్చారు. ఎవరి కోసం ? మన కోసమే కదా.. మనమేమో ఆ విషయాన్నీ గుర్తించకుండా, ఏదో డిటెక్టివ్ లా ఫీల్ అయ్యి, ఫలానా పాట ని అక్కడినుంచి కాపీ కొట్టారు, ఇక్కడి నుంచి లేపేశారు అని కనిపించిన ప్రతోడికి టాం టాం వేసి మరీ చెప్తున్నాం. వాడు ఆగుతాడా, స్టాలిన్ లో చిరంజీవి ఐడియా సక్సెస్ అయ్యినట్టు, మొత్తం పాకిపోతుంది. మన గురించి తీవ్రం గా ఆలోచించే directors కాబట్టి, సిగ్గు లజ్జ పట్టించుకోకుండా కాపీ కొట్టేస్తూనే వున్నారు. దీని వల్ల ఇంకో మంచి కూడా వుందండీ. కాపీ కొట్టారు అని తెలియనంత కాలం ఆహ, వోహో అని పోగుడుకుంటూ, అందరికి ఆ పాట ని వీలైతే వినమని చెప్తూ కబుర్లు చెప్తామా... కాపీ అని తెలిసిన వెంటనే ఫలానా సాంగ్ కాపీ కొట్టినది, వీలైతే ఒరిజినల్ సాంగ్ వినమని చెప్తూ కబుర్లు చెప్తాం. ఎలాగైనా, కబుర్లు ముఖ్యం మనకి. ఏమంటారు ?
సరేలే, బ్యాక్ టు టాపిక్. చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే ప్రాణం అండి. మా అమ్మ కి పాత పాటల మీద మంచి knowledge వుండెడిది. పాట మొదట్లో వచ్చే సంగీతం బట్టి, పాట మొత్తం చేప్పేసేది. క్విజ్ లో ప్రశ్నలు ఎవరు అడుగుతారని మీ సందేహమా ? ఇంకేవరండి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వాళ్ళు. మా ఇంట్లో చిన్నప్పుడు ఒక laptop సైజు రేడియో వుండేది. అలా మా అమ్మపాడుకుంటూ పని చేసేసుకుంటుంటే, నాకు భలే ఆశ్చర్యం వేసేది. చిన్నప్పుడు అంతగా పాత పాటలు వినటం వల్ల కాబోలు, లిరిక్స్ అంటే ప్రాణం నాకు. అప్పుడే కవిత్వం అంటే ఆకర్షితుడ్ని అయ్యాను. నా జీవితం లో ఈ ఆకర్షణ కి చాల ప్రాముఖ్యత వుందండి. ఆకర్షణ అంటే నాకు చాల ఇష్టం (ఆకర్షణ అనే పదానికి అర్ధం చెప్పటం లేదండి. ఆకర్షణ అనేది ఇష్టం అని చెప్తున్నా). ఎంత ఇష్టం అంటే, ప్రతి విషయం లో ఆకర్షణ అనే చాప్టర్ వరకే వెళ్తాను. అక్కడి నుంచి ఒక్క అడుగు, కాదు కాదు, ఒక్క ఇంచ్ కూడా ముందు కి కదలను. ఈ ఆకర్షణ అనేది, చాల విచాత్రం ఐనది అండి. అది, ఇది అనేమి లేదు, సర్వాంతర్యామి. నా చిన్నప్పటి సంగీతం, నా కవితలు, నా బొమ్మలు, నా కధలు, నా నవలలు, నా నాటకాలు (అవునండి, ఒక నాటకం కూడా రాసి, ప్రదర్శించాం కూడా. ఇంజనీరింగ్ లో ధర్మరాజు వేషం కూడా వేశా!), అమ్మాయి:1, దగ్గరి నుంచి మొన్న మొన్న స్విమ్మింగ్, క్రికెట్, డాన్స్, అమ్మాయి:2.. నిన్నటి అమ్మాయి:౩, సాల్సా, సిక్స్ ప్యాక్ వరకు, అన్ని విషయాలు, వస్తువులు నా ఆకర్షణ కి బాధితులే. సీతమ్మ వారికి లక్షమణ రేఖ లాగ, నా సంకల్పాలకి నా ఆకర్షణ అలాగన్నమాట. అప్పుడు సీతమ్మ రావణాసురిడి కోసం చూడలేదు, కాని నేను వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. ఎలాగైనా నేను కూడా ఆ గీత ని దాటాలి (దాన్ని దాటుతున్నప్పుడు చత్రపతి లో మా ప్రభాస్, కాట్రాజు గీసిన గీత ని దాటే effect కావాలి ). నా కళ్లు ఇప్పటికే నాలుగు కాపుల కాయలు కాసేసయండి. ఐదో కాపు కి పూత కూడా పడింది. రావణ! ఎప్పుడు నీ కరుణ ?
అవును, మీకు ఈ పాటికి అర్ధం అయ్యి వుంటుంది, నేను బ్లాగ్స్ వేటిని base చేసుకుని రాస్తున్నానో/రాయబోతున్ననో.. నా fantasies :D ఇక నా సంగీతానికి వస్తే, ఐదో యేడులో కాబోలు తిరుపతికి తీసుకుపోతే, అక్కడ నాలో నిద్రపోతున్న సంగీత విద్వాంసుడు నిద్ర లేచాడు. రైలు బొమ్మతో పాటు, ఒక పిల్లనగ్రోవి టైపు పీకని గోల చేసి మరీ కొనిపించుకున్నా (మరీ చిన్నప్పుడు పావలా పీక తో తృప్తి పడ్డాకాని, అది ఒకట్టే శబ్దం చేస్తుంది. నాకే చిరాకు, జ్ఞానోదయం రెండు కలిసి వచ్చి, వున్నతి [దీన్నే ఇంగ్లీష్ బాష యందు ప్రమోషన్ అందురు] కోరుకున్న ). ఒక రెండు రోజుల పాటు ఆ వేణువు తో, నేను కూడా శాస్త్రీయం గా సాధన చేద్దమనుకున్నానండి, చేశాను కూడా. సున్నితం గా, ఒక పద్దతి ప్రకారం చేతులు కదిలిస్తూ ట్రై చేశా. ఉహు, ఎంతసేపటికి టీవీ లో, రేడియో లో వచ్చేలా శబ్దాలు రాటల్ల! నాకేమో ఆకర్షణ పెట్టిన హద్దు మాత్రం తొందరగా వచ్చేసింది. ఏలాగంటే, first రోజు, మా నాన్న దగ్గర వుండి మరీ ఎలా వూదాలో నేర్పించారు. (కాదు, నేర్పిద్దామని ప్రయత్నించారు. తొక్క లే, ఆయన కి కూడా ఏమి రాదండి. కాకపోతే, ఎలా వూదాలి, ఎలా వేళ్ళు ఆడించాలో తెలుసు.) రెండో రోజు, నాన్న నేర్పవా అని దగ్గరికి వెళ్తే, ఒక చిరునవ్వు నవ్వి, పని మీద బయటికి వెళ్తున్న, అమ్మని అడుగుపో అని తప్పించుకున్నాడు. నేనేమో గేటు దాటి బయటికి వెళ్ళలేను, వెంటపడి ఎడిపిద్దాం అంటే. ఏం అంటారా ? అక్కడ NTRది పేద్దా ఫోటో వుంటుంది. అది అంటే నాకు లాగు తడిచిపోయేదంటా. ఒక రోజు, దాన్ని తుడుద్దామని (తడిచిన నా లాగుని కాదండి, ఫోటోని ) తీసేస్తే, ఆరాధన లో చిరంజీవి కి background మ్యూజిక్ వచినట్టు, నాకు కూడా "అరె ఏమైంది... ఒక మనుసుకు రెక్కలు వచ్చి, ఎక్కడికో ఎగిరింది" అని వచ్చిందేమో, ౩ years age లో, లోకమంతా మా ఇల్లే, అందరు నా చుట్టాలే అన్నట్టు ప్రయాణం start చేసేసా. పక్క వూర్లో నేను తెలిసిన ఎవరో దారిన పోయే దానయ్య వుంటే, గుర్తు పట్టి, మా ఇంటికి చేర్చారు. అప్పటికి వూర్లో గొడవ గొడవ అంట. ఫలానా వాళ్ల అబ్బాయి, తప్పిపోయాడంటా అని. మా theatre కాన్వాస్ బండి పెట్టి, వూర్లో ఫుల్ anouncements అంట (మా కాన్వాస్ బండే గా, ఫ్రీ ఫ్రీ ఫ్రీ ). ఆ రోజులే నయ్యం, ౩ years అయినాను నాకు ఫుల్ following వుంది పక్క వూర్లో కూడా. ఇప్పుడు, మా వూర్లో వెళ్తే, 90% జనాలకి నేనెవరో తెలియదు. మా అమ్మ, నాన్న కి ఒక్కరే కూతురు అనుకుంటారంటా, యెంత చోద్యం అండి! సరేలే, వీడి తిక్క ఇలా వుందా అని, ఆ NTR ఫోటో ని ఇంక ఎప్పటికి తీయ్యలేదు అక్కడి నుంచి. అయినా వాళ్ల ఆటలు నా ముందు ఎక్కువ కాలం సాగలేదు. నా 6th year లో ఇల్లు మారాం. అప్పుడు, దేవుడి హెల్ప్ తీసుకుని, ఆ ఫోటో విషయం వాళ్ళకి గుర్తు రాకుండా చేసేసాగా!
ఇక, రెండో రోజు నా విశ్వ రూపం అంతా చూపించా. శాస్త్రం లేదు, ఆవకాయ బద్ద లేదని చెప్పి, మోటుతనం చూపించా. దానికి కోపం వచ్చి, కళ్లు ఎర్రజేసింది. నాకు చిరాకు వచ్చి, దాని వంటికి నెర్రు వచ్చింది. రోజుఅంత సాధన చెయ్యలేం కదండీ, బడికి పోవాల్సి వస్తుంది. ఈ బడి ఒకటి, ఎప్పుడు టంచన్ గా 8 కే తెరుస్తారు. మా ఆఫీసు లో లాగ, flexible school hours ఎప్పుడు వస్తాయో ఏంటో. బడికి పోతాం వాళ్ల, నా తపస్సు కి భంగం కలిగింది కాని, లేకుంటే అదో నేనో డిసైడ్ చేసేసేవాడిని ఆ రోజు. నేను బడికి పోయాక, మా ఇంట్లో వాళ్ళు కొంచెం సేపు వూపిరి పీల్చుకున్నట్టు వున్నారు. హుహహాహా, అర చేతితో సూర్యుడిని, సాంబార్ తో సింహాన్ని, school పేరు తో నన్ను ఆపటం ఎవ్వరి తరం కాదు. బడి వదిలిపెట్టగానే, ఎదవలతో సొల్లు, గోలిలాటలు పెట్టుకోకుండా ఎకపీకిన ఇంటికి వచ్చి, ఏకంగా దాని దగ్గరికే పోయా. అక్కడ PRP వాళ్ల రైలు ఇంజన్ వుంది కాని, పీక లేదు. (ఈ రెండు రోజుల టైం లో, passengers ఎక్కువ లేరు అని నేనే compartements కౌంట్ తగ్గిచ్చా.) కొంతసేపు, హీరో ని వేరే అమ్మాయితో చూసిన హీరోయిన్ లా అయిపోయాను.( ఫ్రేమ్ అడ్డదిడ్డం గా కోయబడిన నాలుగు ముక్కల కింద విడిపోయింది.) కొంచెంసేపటికి తేరుకున్నా (మళ్ళి ఫ్రేమ్ కలిసిపోయింది).. నా ఈ పీక కనపడని కుట్ర లో భాగస్తులు ఎవరు అయ్యి వుంటారని తీవ్రం గా ఆలోచించా, వెంటనే స్పురించారు ద్రోషులు. నా కోర్ట్ లో నాకు తెలిసినవి రెండే శిక్షలు, ఆ శిక్షల్ని ముద్దయాల మీదే ప్రయోగిస్తా, దోషుల మీద కాదు. అందులో, ఒకటి.. అరిచి గీ పెట్టి, చెవులు బద్దలు యెసిపొయెల చెయ్యటం. రెండు.. కాళ్ళకి అడ్డం పడి, పనులు చేసుకోకుండా చెయ్యటం. మా అమ్మ దగ్గర మొదటిది పని చెయ్యదు. (బహుశా, ఏదో సినిమా లో చెప్పినట్టు, ఏడుపు పిల్లలకి మంచిది అని నమ్ముతుంది కాబోలు. రేపు కనుక్కుంటాలే).. రెండోది ఐతే బెస్ట్, ఎందుకంటె మా నాయనమ్మ అంటే పిచ్చా భయం మా అమ్మ కి, ఆమ్మ కిను. ఆవిడ అల అలా లోకాభిరామాయణం చర్చించి లోపలకి వచ్చేప్పటికి, ఇంట్లో పని అంతా అయిపోవాలి. ఇంకేం, మన తడాఖా చూపించా. దెబ్బకి, నా చేతుల్లో నా మొదటి సంగీత పరికరం, జనాల చెవుల్లో దూదులు. ఆ రోజు రాత్రి మా నాన్న వచ్చాక, మళ్ళి వెళ్లి కెలికా.. ఈ సారి నేర్పమని కాదులెండి. పగిలిపోయింది బాగు చెయ్యమని. మా నాన్న కి పాడైపోయినవాటిని బాగు చెయ్యటం భలే వచ్చు. బాగు చెయ్యటమే కాదు, చేసేప్పుడు పక్కన కుర్చ్చోపెట్టుకుని చాలా విషయాలు చెప్పేవాడు, ఇప్పటికి చెప్తుంటాడు కాకపోతే ఇప్పుడు అన్ని మనకి తెలిసినవే. మన knowledge బాగా పెరిగిపోయింది కదా. నాకు మా నాన్న లో నచ్చే చాలా విషయాల్లో అది కూడా ఒకటి. ఇప్పుడు ఐతే మా అమ్మ పార్టీ మార్చేసి, నా కొడుకు తో బాగుచేపించుకుంటా అని నా దగ్గరికి తీసుకువస్తుంది కాని, నేను నేర్చుకుంది ఆయన దగ్గరే అని మర్చిపోతుంది. నేను కాదు కాని, మా చిన్న అన్నయ్య ఐతే చాలా నేర్చుకున్నాడు. మెకానిక్ షాప్స్ లో పని చేసేవాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ల ఇద్దరికీ. ఇంట్లో పవర్ పోయినా, మోటార్ పని చెయ్యటం ఆగిపోయినా మా నాన్న లేకపోతే అన్నయ్య వుంటే చాలు. ఇప్పుడు ఆ గొడవ ఎందుకులే కాని, నా వేణువు కి neat గా ప్లాస్టర్ వేసి, నేర్రులు వస్తే వెంటనే ఏదో ఒకటి చెయ్యాలని, లేకపోతే అవి కాలక్రమేణ పెరిగి, వస్తువు విరిగిపోయేంత వరకు వస్తుంది అని లెస్సొన్ అఫ్ ది డే ఒకటి నేర్పించాడు. థర్డ్ డే కూడా అందరు నా గోల ని కొంతసేపు తిట్టుకున్నారు కాని, lite తీసుకున్నారు కొంతసేపటికి. ఎవ్వరు నన్ను పట్టించుకోపోఎప్పటికి నాకు కూడా బోర్ కొట్టింది. దానిని ఒక మూల పడేసి, రైలు లో passengers ని తిప్పుకుందామని నిశ్చయించుకున్న. నేను రెండు రోజులు వేణువు ని పట్టించుకోకపోయేసరికి, మళ్ళి దాని మీద కుట్ర జరిగింది. ఆ కుట్ర ఫలితం గా, ఎన్నో సంవత్సరాలు చీకటి గది కి పరిమితం కావాల్సి వచ్చింది ఆ వేణువు. ఎప్పుడో, మా తాత వాళ్ళు ఇల్లు శుభ్రం చేసుకుంటుంటే, త్రవ్వకాలలో వెలికిపడింది అంట. నాలో సంగీత కుతూహలానికి, నీళ్లు కాదు, co2 కొట్టి మరి ఆపినవాళ్ళు మా ఇంట్లో వల్లే అని నేను ఇప్పటికి నమ్ముతాను. తరువాతా ఇంకో 5-6 సార్లు ఆకర్షణ అనే చాప్టర్ ని దాటుదామని ప్రయత్నిమ్చానండి. 8th-9th క్లాస్సేస్ లో, drums ని ప్రయత్నించా. నో ఫలితంస్. సరేలే కదా, ఇంకా బోలెడు పరికరాలు వున్నై కదా అని అప్పటికి శాంతించా. ఇంజనీరింగ్ లో ఏకం గా, violin అండ్ కీబోర్డు కోసం, తీవ్రంగా కాకపోయినా పర్లేదు, ప్రయత్నించా. మా ఫ్రెండ్ పుణ్యమా అని వయొలిన్ మీద సప్త స్వరాలు ప్లే చెయ్యటం వచ్చింది. కంప్యూటర్ కీబోర్డు మీద టైపింగ్ చెయ్యటమే సరిగ్గా రాదు నా బతుక్కి, ఇంక కీబోర్డు ప్లే చెయ్యటం వస్తుందా చెప్పండి. మొన్న, సెలవలకి ఇంటికి వెళ్ళినప్పుడు, ఏక్ తార అంటారు చూడండి, అది కొనిపెట్టాడు మా నాన్న. ఒకటి ఐతే పాడు అయిపోతే, మన అభ్యాసన కి break పడుతుందని, spare కోసం రెండోది కి కొనుక్కున్న. దాని మీద కూడా మన ప్రతాపం చూపించా. ఫైనల్ result సున్నా. ఈ సారి, ఆకర్షణ హద్దు వుంది కదా, దాని చేరుకోటానికి పెద్ద సమయం పట్టలేదు. సరేలే అని, మా అన్నయ్య వాళ్ల అబ్బాయికి ఇచ్చాను నేను కొనుక్కున రెండింటిని, atleast వాడైన గొప్ప సంగీత విద్వాంసుడు అవుతాడేమో అని.
మీకు ఒక బ్రహ్మ రహస్యం కంటే గొప్ప విషయం చెప్పాలని వుందండి. (ఇంత సొల్లు చెప్పావ్, ఇంకెందుకు ఆలస్యం అంటారా?). సరే, వినండి.. ఇప్పుడు యూత్ అంతా అమ్మాయిలని ఆకర్షించటానికి ఏం చేస్తున్నారో తెల్సా, first gym కి పోయి బాడీ డెవలప్ చేస్తున్నారు, దీనికి ఐతే బ్రెయిన్ వాడాల్సిన పని లేదు కదా. ఆల్రెడీ డెవలప్ చేసినా, result నిల్ ఐతే, నెక్స్ట్ సాల్సా నేర్చుకోవాలి. దీని కోసం, కొంచెం కష్టపడాలండి. కాని తప్పదు, ఇటు వైపు గర్ల్ ఫ్రెండ్స్ మరి. ఐనా, రిజల్ట్స్ సంతృప్తికరంగా లేకపోయినా, ఫలితాలు త్వరితగతిన రావాలన్నా, గిటార్ tutorials కి పోవాలి. నా మాట మీద నమ్మకం పెట్టండి చెప్తున్నా, గిటార్ ప్లే చెయ్యటం రాకపోయినా పర్లేదు.. భుజాన వేసుకుని తిరగండి చాలు. మీరు బైక్ అమ్మేసి, బస్ కొనుక్కోవలసి వస్తుంది (ఏం అంటారా మళ్ళి? మీకు చెప్పలేక చచ్చిపోతున్నానండి బాబు! అదేనండి, అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ని కాఫీ డే కి ఎలా తీసుకెళతారు మరి). అదీ, పవర్ అఫ్ మ్యూజిక్ అంటే. జనాలకి ఇప్పుడు , ఈ మధ్య తెలిసింది కాని, నాకు ఈ విషయం చిన్నప్పటి నుంచి తెలుసండి. అందుకే, సంగీతం సంగీతం అని చచ్చాను ఇన్నాళ్ళు. ఏకం గా మూడో మెట్టు ఎక్కేద్దాం అనుకున్నా, కాని దుర్ద్రుశ్తవశాత్తు జారి పడిపోయా. అందుకే, కొంచం లేట్ అయ్యినా పర్లేదు, మొదటి నుంచి వద్దాం అని gym కి వెళ్ళటం start చేశా ఈ మధ్యనే :) కాని, గ్యారంటి గా రెండో మెట్టు ఎక్కకూడదని నిశ్చయించుకున్నా. నాకు చాలా గట్టి నమ్మకం అండి, నా టాలెంట్ అంత westren అని, guaranty గా నేను గిటార్ హీరో ని అయ్యిపోతానండి, సాధన start చేస్తే. (ఎలానో ఇన్నాళ్ళు గిటార్ మీద ప్రయత్నాలు జరగలేదు కదా, అందుకనే ధైర్యం) శుభం జరగాలని, నేను విజయం సాదించాలని భైరవద్వీపం లో KRవిజయ లెవెల్ లో దీవించండి. రెహ్మాన్ దగ్గర కాకపోయినా, కనీసం లోకల్ టాలెంట్ కీరవాణి దగ్గర guitarist గా సెటిల్ అవుతా. అవును, చెప్పటం మర్చిపోయా, నాకు మాత్రం కీరవాణి సంగీతం అంటే పిచ్చి అండి. టాలెంట్ లో, వైవిధ్యత లో, ఇళయరాజా తో ఐతే పోల్చను కాని.. melodious గా, వినసొంపైన tunes ఇవ్వటం లో కీరవాణి కింగ్. ఒక 15-20 years క్రితం పాటలు తీసుకుంటే, కీరవాణి గొప్పతనం అర్ధం అవుతుంది. ఆయన స్వరపరచిన చాలా గీతాలు melodies. ఆయన లో గొప్పతనం ఏంటంటే, ఆయన మనస్సులో పుట్టింది అంటే, అది మెలొడీ ట్యూన్ అయ్యి వుంటుంది, ప్రత్యేకం గా ఇంకో ట్యూన్ చెయ్యాలని కూర్చోకపోతే. వేరే సంగీత దర్శకులకి అలా కాదు, మెలొడీ సాంగ్ ట్యూన్ కావాలంటే, అడిగి చేపించుకోవాలి, లేకుంటే వైవిధ్యత కోసం వల్లే చేస్తారు.
అరె, ఏ కీరవాణి సాంగ్ అయ్యినా తీసుకోండి, అన్ని చల్లగా పిల్ల గాలి మోము ని తాకుతున్నట్టు, మనస్సుని హత్తుకునే విధం గా వుంటాయి, గమనించండి. "చల చల్లగా గాలి, మెల మెల్లగా తేలి" అంటూ సాగే గీతం గుర్తుకు వచ్చేలా వుంటై.
నేను ఇంక గమనించింది ఏంటంటే, అన్ని సాంగ్స్ (సరే, చాలా వరకు సాంగ్స్) లో సాహిత్యం చాలా అర్ధవంతం గా వుంటుంది. అది పూర్తిగా సంగీత దరసకుడి గొప్పతనం అని చెప్పాను కాని, ఆయన ప్రభావం మాత్రం కాదనలేనిది. గేయ రచయిత కి కావాల్సిన స్వేచ్చ ఇస్తాడేమో అని నా నమ్మకం. మీకు ఎప్పుడైనా నిద్ర పట్టకపోయినా, మనస్సు కలత గా వున్నా, కీరవాణి సాంగ్స్ పెట్టుకుని వినండి. "జాము రాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా" అని సాగిపోయే గీతం ఎన్ని తరాలు అయ్యినా, అలా మెలొడీ కాటేగోరి లో టాప్ లో వుంటుంది, నిజంగా కీరవాణి మన దగ్గరకి వచ్చి జోల పాడుతున్న భావం ఏర్పడుతుంది. అల్లరి ప్రియుడు లో సాంగ్స్ అన్ని ఆణిముత్యాలు. ఆయినా, మనం సూపర్ మెలొడీ కాటేగోరి చర్చిస్తున్నాం కాబట్టి, అలాంటివే చెప్తాను. "ఆహో, ఒక మనసుకి నేడే పుట్టిన రోజు" అనే సాంగ్, నిజం గా ఆహో అనిపిస్తుంది శ్రోతల చేత. అమ్మ చెప్పింది అనే చిత్రం లో "మాటలతో స్వరాలే షికారు కి వెళ్తే గీతం", లిరిక్స్ ని tunes ని కలిపి నిజంగానే షికారు చేపించినట్టు వుంటుంది. ఈ చిత్రం పెద్ద విజయం సాదించలేదు కాబట్టి గీతాలు పెద్ద ప్రాచుర్యం పొందలేదు కాని, లేకుంటే అందరి albums లో ఒక must to keep. అన్నమయ్య, మీ అందరికి తెలుసు, మళ్ళి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ప్రతి సాంగ్ అద్భుతం. వారానికి ఒక్కసారైనా ఈ పాటలు వినకుండా లేను, వుండలేనేమో అనిపిస్తుంది. అనుకోకుండా ఒక రోజు లో నీడల్లే తరుముతూ వుంది అనే సాంగ్, నిజంగానే చెవ్వుల్లో వినిపిస్తూ, కొంతసేపు తరుముతూ వుంటుంది. అన్వేషణ లో ఇళయరాజా సృష్టించిన "ఇలలో కలిసే శిధిలాకాశం" అనే కలవర పరిచే గీతాన్ని జ్ఞప్తికి తెచ్చేదిగా వుంటుంది. ఆపద్భాందవుడు లో "చుక్కల్లారా, చూపుల్లారా" అనేది ఇంకో నిద్రపుచ్చే గీతం. ఇదే చిత్రం లో వున్నా మరో గొప్ప సృష్టి "అవురా, అమ్మకు చెల్లా", ఈ పాట మొదట్లో, వివిధ రకాల tunes ని మనకి వినిపించటం జరుగుతుంది. అన్ని కూడాను, స్వల్ప వైవిధ్యత తో, పామరుడు కూడా ఆ వైవిధ్యతని గుర్తించగలిగేలా తీర్చిదిద్దిన ఘనత మా కీరవాణిదే. బావ నచ్చాడు లో అనురాగం అనురాగం లో అనే సాంగ్ లో మగ గొంతు సరిపోలేదు అనిపించేలా వుంటుంది కాని, సంగీతం మాత్రం అదుర్స్. బొంబాయి ప్రియుడు నా ఇంకో ఫేవరెట్ ఆల్బం. మీరు ఇంతకుముందు ఎందుములంగా ఐనా ఈ ఆల్బం ని ignore చేసి వుంటే, చెంప దెబ్బలు వేసుకుని, నాలుగు గుంజీళ్ళు తీసి, డౌన్లోడ్ చేసి, favourites లో పెట్టుకోండి. ఇప్పుడు మనం, చత్రపతి అనే, కీరవాణి కి చెడ్డ పేరు తీసుకువచ్చిన, మంచి ఆల్బం గురించి మాట్లాడుకుందాం. "అగ్ని స్కలన సంధగ్ధరిపు" అనే సాంగ్ ని కాపీ కొట్టటం జరిగింది. గమనించండి, ఒరిజినల్ సాంగ్ ని మూవీ starting లో ప్లే చేస్తారు, కొంతవరకు తప్పు ని కప్పిపుచ్చటానికి... ఇక, కాపీ కొట్టటం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, క్రెడిట్స్ లో ఒరిజినల్ సాంగ్ ని mention చెయ్యటం జరగలేదు. ఇక తెలియక కొంతమంది, "మన్నేల తింటివిరా కృష్ణ" అనే సాంగ్ ని రాజహంస అనే అబ్బాస్ మూవీ నుంచి ఎత్తేసారు అనుకుంటున్నారు. "గుండు సూది" అనే యుగళ గీతాన్ని రమ్యకృష్ణ ఓల్డ్ మూవీ ఒకటి వుంటుందండి, అందులోంచి తీసుకోటం జరిగింది. పై రెండు చిత్రాలకి కూడా కీరవాణి గారే సంగీత దర్శకులు. తన సాంగ్స్ ని తనే కాపీ కొట్టుకోటం తప్పు కాదనుకుంట. "తెలుసా మనసా" అనే సాంగ్ ని ప్రేమించని తెలుగోడు వుండడు అంటే, అతిశయోక్తి కాదు, క్రిమినల్ చిత్రంలోనిది అని చెప్పాల్సిన పని లేదు కదా. బాలయ్యది, గాండీవం అని, ఒక flop(?) సినిమా వుంది, దానికి కూడా మెలొడీ కింగె దర్శకుడు. "గోరువంక వాలగానే గోపురానికి" అనే సాంగ్ కి, గోరువంక, మగ కోకిల పాట పాడుతుందేమో అని బ్రమపడాల్సిందే. (మగ కోకిల ఏంటి రా, చెత్త ఎదవ అని తిట్టకండి.. ఆ సాంగ్ లో ఎక్కువ మగ గొంతు వుంటుంది. కొంప తీసి, మగ కోకిలలు వుండవా అని అడుగుతారా ఏంటి ? మీకు ఒక నమస్కారం.) గోవిందా గోవిందా, ఈ మూవీ ఎందుకు హిట్ కాలేదో తెలియదు కాని, కీరవాణి మాత్రం ప్రపంచపు అంచుల వరకు తీసుకెళ్ళి, "అల్లదిగో, దాన్నే స్వర్గం" అంటారు అని చూపించి తీసుకొచ్చాడు. background మ్యూజిక్ దగ్గరినుంచి, "అందమా అందుమా", "అమ్మ బ్రహ్మా దేవుడా" వరకు, అన్ని మైమరిపింప చేసేవే! కాదంటారా ? కిష్కింద కాండ లో "తొలి వలపుల, చెలి పిలుపుల ప్రేమ లేఖల్లో" అనే గీతం పాతనాటి గీతలని గుర్తుచేస్తుంది. లాహిరి లాహిరి లాహిరి లో, "మంత్రమేదో వేసింది, మాయఎదో చేసింది" అంటూ మనల్ని నిజంగానే మాయ చేసాడు. సూపర్ మేలోడీస్ category లో, ఆకాశం లో ధ్రువ నక్షత్రం లా, సుస్థిర చోటు సంపాదించుకున్న ఇంకో రెండు గీతాలు, మాతృదేవోభవ అనే చిత్రంలోవి. "వేణువై వచ్చాను భువనానికి" డైరెక్ట్ గా మనస్సు ని తాకుతుంది. తాత్పర్యం కూడా, మెదడుకి వెళ్ళదండీ. ఆ పాట వింటున్నప్పుడు, మనస్సు మనల్ని తన అధీనం లోకి తీసుకుంటుంది. ఏంటి, కథలు చెప్తున్నా అనుకుంటున్నారా? ఒక్కసారి ఆ సాంగ్ ని ఇప్పుడే తీసి, ప్లే చేసి, కళ్లు మూసుకోండి. నా మాటల్లో నిజం మీకే తెలుస్తుంది. ఇదే చిత్రం లోని, "రాలిపోయే పువ్వా నీకు రాగాలూ ఎందుకె" అనే గీతం వింటుంటే, ఆ పువ్వు లోని రాగాలన్నీ తీసి, ఈ పాటలో కలిపి, మన చెవిలో రంగరించి పోసినట్టు వుంటుంది. మనఃస్పూర్తి గా చెప్తున్నానండి, ఇప్పటివరకు నేను చెప్పిన సాంగ్స్ ఎలాంటివంటే, మనకి చెవిలో నొప్పి వస్తే, ear డ్రాప్స్ వేసుకుంటే ఎంత రిలీఫ్ వస్తుందో, అంతా రిలీఫ్ ని తీసుకువచ్చే రకం. అమ్మ జోల పాడినట్టు, నిద్ర పుచ్చే మరో గీతం "సుఖీభవ సుమంగళి, సుఖీభవ!" అనే మేజర్ చంద్రకాంత్ చిత్రం లోని సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటి. నిజంగా అమ్మ జోలపాట ఎలా వుంటుందో గుర్తులేదు కాని, అంతకు మించి మాత్రం బాగుండదని తెలుసు. ఒక రాజు, ఒక రాణి లో, "స్వరాల వీణ ఈ వేళలోన" కూడా వినబుద్ధి వేస్తూవుంటుంది. ఒకరికి ఒకరు, ఇంక చెప్పేది ఏముంది, వింటున్నంత సేపు కట్టిబడేస్తుంది. తనకి లోబరచుకుంటుంది ఆ మాయ. ఒక musical magic, సింపుల్ గా. చెప్పటానికి మాటలు సరిపోటం లేదులే కాని, "నువ్వే నా శ్వాస" అనే గీతం తో, కీరవాణి సంగీతమే మా శ్వాస అని అయన అభిమానులతో మరో సారి చెప్పించ్చుకున్నాడు. ఇక తారక రత్న కి కనీసం average గా ఆడిన సినిమా ఒకటి వుంది అంటే, అది కీరవాణి చలువ, ఒకటో నెంబర్ కుర్రాడు రూపం లో. "నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే వుంటా" అని సాగే ఈ గీతం చాలామంది one side lovers కి యద లో కొలువుండిపోయింది. lovers ఒక్కరికే కాదండి, నాలాంటి మెలొడీ పిచ్చోల్లకి కూడాను. పల్లకిలో పెళ్లి కూతురు అని, బ్రహ్మానందం గారి తనయుడి తో చిత్రించారు, పాటలు బానే వుంటాయి, ఒకసారి ప్రయత్నించండి, మీకు కూడా నచ్చోచు. ఒక quote చెప్పనా.. పది చెడ్డ పాటలు విన్నా ఫర్లేదు, ఒక్క మంచి పాట కూడా తప్పించుకోటానికి వీల్లేదు. పరదేశి అని ఇంకో musical హిట్ వుందండి కీరవాణి గారి ఖాతా లో. "మల్లె పువ్వులాగా, మనస్సు దోచే సీమ దొరసాని" అంటు మనస్సు దోచేసుకుంటుంది. "మళ్ళి మళ్ళి మళ్ళి పూసింది, మధువన" అనే సాంగ్, మళ్ళి మళ్ళి, మళ్ళి మళ్ళి, వినాలనిపించేలా వుంటుంది. కాని, ఎక్కువ కాలం గుర్తు వుండే, సత్తాలేదు ఈ పాటకి. పెళ్లి సందడి అని ఒకప్పుడు, టాలీవుడ్ లో సందడి చెసినా సినిమా గుర్తు వుందా ? అది 365 డేస్ ఆడటానికి సంగీతం ముఖ్య కారణం అంటే, వప్పుకోవాల్సిందే. ఏ సాంగ్ అని చెప్పను, మా పెరటి జాంచెట్టా, సౌందర్యలహరా ? లేకపోతే హృదయమనే కోవెల తలపులు తెరిచిన అంటు మన సంగీతాభిరుచి ని పదును పెట్టిన సాంగా? ఆ తీర్పు ని మీకే వదిలేస్తున్నాను. "పూసింది పూసింది పున్నాగ, పూసంత నవ్వింది నీలాగా" అని మీనా చెలాకి గా నటించిన సాంగ్ ని చూసారా ? ఎంత గొప్పగా వుంటుందో. ఆ సాహిత్యానికీ, ఆ సంగీతం అద్భుతం గా సరిపోయింది. సింహాద్రి.. టాలీవుడ్ ని ఒక వూపు వూపిన చిత్రం. ఈ సినిమా విడుదలకి నేను ఇంటర్ లో వున్నానండి.. సినిమాలు చూసి పాడవ్వకు బుజ్జి అని చెప్పిన మా అమ్మ మాటలు పక్కన పెట్టి.. కీరవాణి సంగీతం, జూనియర్ NTR ని చూసి ధైర్యం చేసి వెళ్ళాను. నేను మా అమ్మకి ఇచ్చిన మాట తప్పినా, అనందం వేసింది. అఫ్ కోర్సు, ఇప్పుడు మాట తప్పటం అలవాటు అయ్యిందనుకోండి. ఇందులో "అమ్మైనా, నాన్నైనా" నా ఫేవరెట్. ఈ ట్యూన్ ని, కిష్కింద కాండ అనే తన గత చిత్రంలోంచి తెచ్చుకోటం జరిగింది. "గుజరాతి పరదాల, పంజాబీ పరువాల" అనేది ఒరిజినల్ సాంగ్. తరువాత, జూనియర్ NTR తోనే "ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము" అని పాడించారు. ఇప్పటికి, ప్రతి farewell ఫంక్షన్ లో ఇదే సాంగ్ ని ప్లే చేస్తూ వుంటారు, అంత గొప్పగా స్వరపరిచారు. శుభ సంకల్పం అని, కమల్ హస్సన్ అవార్డు గెల్చుకున్న సినిమా కి కూడా, కీరవాణి గారే సంగీతం అందించారు. "సీతమ్మ అందాలు" అంటూ ఆమని తన వొంపుల అందాలు, కీరవాణి స్వరాల అందాలూ కలిపి చూపించిన సాంగ్. సుందరాకాండ, "ఆకశానా సూర్యుడుండడు సంధ్యవేలకే" అనే సాంగ్ ని జోలిపాటల playlist కి add చేసుకోండి. ప్రత్యేకం గా "నవ్వవే నవ మల్లికా, ఆశలే అందాలుగా" అనే పాదం దగ్గర మనోహరం గా వుంటుంది. యమదొంగ లో "నూనుగు మీసాలోడు", సింహాద్రి లో "నన్నేదో చేయ్యమాకు" రెండు కూడాను జానపదాల స్టైల్ లో సాగే మేలోడీస్. పైన చెప్పిన, ప్రతి సాంగ్, కోకిల కుహు కుహులు వసంత మాసంలోనే పెట్టి, మిగిలిన కాలలని పట్టించుకోనందుకు.. ప్రక్రుతి మొదట సిగ్గుపడి, తరువాత ముచ్చటపడి, కీరవాణి రూపం లో సృష్టించిన అద్భుతాలు అనిపిస్తుంటై నాకు.
ఇంక మాస్ మసాల సాంగ్స్ మాటేంటి అంటారా ? నేను పెద్దగ వాటిని పట్టించుకోను కాని, అడిగారు కాబట్టి చెప్తున్నాను. "నువ్వు విజిల్ వేస్తే ఆంధ్ర సోడా బుడ్డి", "కాలేజీ పాపల బస్సు", "గూట్లో వుంది బెల్లం ముక్క", "పంచాదర చెట్టు మీద పాలపిట్ట"(సుల్తాన్ చిత్రం), "సుగునాభిరాముడు, సమరాన భీముడు.. ఒక్క మగాడు" ( అస్సలు, సీతయ్య సినిమా హిట్ అవ్వడానికి వున్నా ఒక్క reason కీరవాణి. సిమ్రాన్ కూడా కొంచెం హెల్ప్ చేసిందనుకోండి), "నీక్కావలిసింది, నా దాగ్గర వుంది", "కుచిపూడికైన తకదిమి దేనికైనా రెడీ".. ఇలా ఎన్నో, దేనికైనా రెడీ అని చెప్తున్నట్టు వుంటాయి. ఇంకో మాట నాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అన్నా ఇష్టమే. అఫ్ కోర్సు, ఆ మ్యూజిక్ ఇష్టపడనివాడు ఆంధ్ర లో వుండడనుకోండి.
మీ,
naagas
తప్పా ? తప్పున్నరా? అస్సలు వాదన కూడా అవసరం లేదు. మనలో చాలా మంది తడుముకోకుండా చెప్పే సమాధానం. నిజమే, అమ్మాయిలని పట్టుకుని కొట్టటం తప్పే.. ఒప్పుకుంటాను. కాని, ఎందుకో ఒక్క క్షణం అనర్దాలు జరగకుండా చర్యలు తీసుకొనే వాళ్ళు ఇంకా వున్నారు అనే సంతోషం కలిగింది మనసులో (అనర్దం ఏంటి, ఎం మాట్లాడుతున్నావ్ అని కోప్పడకండి. మొదట నన్ను ముగించనియ్యండి). ఇదే విషయాన్నీ, మా ఫ్రెండ్స్ తో పంచుకుందామని, మా బేవార్స్ గ్రూప్ కి మెయిల్ చేశాను. నేను చేసిన తప్పు ఒక్కటే, discalimer జత చెయ్యటం మర్చిపోయా, ఇవన్ని నా వ్యక్తిగత అభిప్రయాలు అని :) అది అన్నిటికంటే నిజమైన అనర్దం అని, తెలుసుకోటానికి నాకు ఆట్టే టైం పట్టలేదు. నా inbox, వరసుగా 100 మెయిల్స్ తో నిండిపోయింది. అందరు తిట్టేవాల్లె :( "how can you support రామసేన raa" అని. అరే, నేను వాళ్ళు చేసిన పనిని సమర్దించలేదు, వాళ్ల ప్రయత్నాన్ని సమర్దిస్తున్నాను అంతే! అని చెప్తే వినేవాడు ఒక్కడు కూడా లేడు.
ఇక్కడ రాస్తున్నది అంతా నా వ్యక్తిగత అభిప్రయాలు. నేను, చదవమని, ఏకీభవించమని ఎవ్వరిని అడిగుండలేదు. కావున, వీటిని ప్రశ్నించే హక్కు ఎవ్వరికి ఇవ్వటం జరగటంలేదు. నేను ఒక్క విషాయాన్ని గట్టిగా నమ్ముతాను. ఎవ్వరికైనా, వినేవాడికి ఇష్టమైనంతకాలం, వాళ్ళ అభిప్రాయలు చెప్పె హక్కు వుంది. ఎవ్వరి అభిప్రాయాలు వాళ్ళవి.. ఎవ్వరు వాటిని మార్చుకోలేరు. చెప్పేవాడితో వాదన వల్ల సమయాభావం తప్ప, పెద్ద ప్రయోజనం జరగదు. మీకు, ఎవ్వరైనా ఎమైనా చెప్తే, చర్చించండి కాని, వాదించొద్దు. వారి మాటల్లో మీ అభిప్రాయాలకి సరిపోయే మంచిని తీసుకుని, మిగిలింది వదిలెయ్యండి.
సరే, ఒక్కసారి మనం రామసేన గొడవ పక్కన పెట్టి, మనుషుల్లో విధాలు గురించి చర్చించి, ఇదే విషయం దగ్గరికి మళ్ళి వద్దాం.
అస్సలు, మనుషుల మెంటాలిటీ కి ఒక స్కేల్ వుంది. (నేను దీని మీద రీసెర్చ్ ఏమి చెయ్యలేదుగాని, నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను, అంతే.. తప్పులు వుంటే మన్నించండి, అస్సలు అర్ధమే తప్పనుకుంటే పెద్ద మనసుతో వదిలెయ్యండి). సరే, ఇప్పుడు ఈ స్కేల్ ని 0 నుంచి 10 వరకు కొలుద్దాం (మేము చిన్నప్పుడు 15cms స్కేల్ వాడాం, ఇదేంటి 10 వరకే వుంది అంటారా ? కాలం తో పాటు అన్ని మారుతువుంటయండి. నా చిన్నప్పుడు పరీక్షలు 100 మార్క్స్ కి రాశాను, ఇంజనీరింగ్ లో 10 cgpa సిస్టమ్ అంటే సర్డుకుపోలా, ఇది అంతే ). స్కేల్ కి, ఒక చివరి వుండే జనాలు, అంటే సున్నా దగ్గర, నా ఇష్టం వచినట్టు నేను బతుకుతా, అంతా నా ఇష్టం అంటూంటారు. వీరిని modern people లేకుంటే కొత్త తరం వాళ్ళు అంటాం. ఇంకో వైపు జనాలు, పూర్వికులు ఎలాగైతే బతికారో మనం కూడా అలానే బతుకుదాం అంటారు. వీరినే మనం, చాందసవాదులు అంటువుంటాం. మొదటి వారిని కొత్త తరం వాళ్ళు అని ఎందుకు అన్నానంటే, చందాస వాదులు అని వున్నట్టు, ఈ టైపు వాళ్ళకి ప్రత్యేకమైన పేరు ఏమి లేదు. కొత్త తరం లోనే, ఇలాంటి వాళ్ళు ఎక్కువ, కావున ఈ సారికి ఇలా సర్దుకుపోదాం. నాతొ ఒకసారి మా ఫ్రెండ్ చర్చిస్తున్నప్పుడు ఈ విషయం చెప్పాడు, communisam లో శిఖరాలని చేరుకున్న మహానుభావులు, అభివృద్ధి ని వ్యతిరేకిస్తారంట.. ఎందుకో తెలుసా, అభివృద్ధితో పాటే అసమానతలు వస్తాయనే భయంవల్ల. ఈ విషయం ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే, చాందసవాదం ఈ విధంగా కూడా జనించవచ్చు అని అంతే.
ఐతే వీళ్ళ వాదనలు ఎలా వుంటాయో చర్చిద్దాం, ఇప్పుడు. మొదటి రకం వాళ్ళు.. వీళ్ళు, నీ మనసుకి చేయ్యలనిపించిన ప్రతి దాన్ని చేసెయ్యి, నీ ఇష్టం, నీకు ఆనందం కలుగుతుంది అంటే, పర్యవసానాలు గురించి (పెద్దగా ?) పట్టించుకోకు అంటారు. ఈ ధోరణి వీపరితం గా వుండేవాళ్ళు sadist/psycho లా మరిపోటానికి అవకాశాలు లేకపోలేదు. వీరి గురించి ఎక్కువ మాట్లాడుకోటానికి ఏమి లేదు. స్వార్ధం అనే దానికి అబ్బ లాంటి భావన, మనిషి రూపం దాలిస్తే వీళ్ళే. ఉగ్రవాదులని (అవును, వాళ్ళకి వ్యక్తిగత స్వార్దం వుండకపోవచ్చు గాక, అయినా ఉగ్రవాదాన్ని మొత్తంగా తీసుకుంటే, వాళ్ల కోర్కెలు స్వార్దాన్ని మీరిపోతాయి) ఈ స్కేల్ మీద పరిగణిస్తే, ఈ కోవలోకే వస్తారని నా అభిప్రాయం. భవిష్యతు లో పర్యవసానాలు ఎలా వుంటాయో ఆలోచించే, సమయం.. ఆలోచించాలనే ఆలోచన వీరికి వుండదు. ఉదాహరణ కింద, WTO మీద దాడి ని పరిగణించవచ్చు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తో వీరికి పని లేదు. వారి ప్రాణాలతో కూడా వారికి సంబంధం లేదు. చూడండి, పైశాచికత్వం. నాకు దురాలవాట్లకి, చెడుకి తేడా తెలియదని కొట్టిపడేయ్యకండి, రెండిటికి పెద్ద తేడా లేదు నిజానికి. మొదటిది సొంత హాని చేసేది ఐతే, రెండోది ఇతరులకి హాని చేసేది. పక్క వారిని చంపటానికి నీకు ఎలాగైతే హక్కు లేదో, నీ ప్రాణం తీసుకోటానికి కూడా అలాగే హక్కు లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పలనుంది. నువ్వు అంటే నువ్వు ఒక్కడివే కాదు, నీ ఆత్మీయులు, నీపై వాళ్ళ ఆశలు, నీ ఆశయాలు, నీ అలోచనలు, నీ కర్తవ్యాలు, నీ బాధ్యతలు, నువ్వు ఇంతవాడివి అవ్వటానికి ఎందరో పడ్డ కష్టాలు, భూమిపై నువ్వు వాడుకున్నవనరులు .. వాటినన్నీంటికి సమాధానం చెప్పి చావు కావాలంటే. ఒహో, ఐతే sadist దేవుడిని నమ్మడంటావ్ ? అందరు ఒకలా వుండరని ముందే చెప్పాను. sadist/psychos అంటే, విపరీతధోరణి కలవారు అని అర్దం. దేవుడిని విపరీతంగా నమ్మేవాళ్ళు కూడా దేవుడికోసం ఎదో చేస్తున్నామంటూ, psychoగా మారే అవకాశాలు వున్నయి.
స్కేల్ లో కుడి చేతి వైపుకు జరిగితే, అక్కడ, ప్రాశ్చాత్య సంప్రదాయాన్ని (క్షమించాలి, ఇక్కడ నేను, భారతీయుల గురించి మాట్లాడుతున్నానండి. మనల్ని ప్రభావితం చేస్తుంది, మనకంటూ ఒక ప్రత్యేకత లేకుండా చేస్తుంది.. ఇంకా ఇక్కడ తప్పు గానే పరిగణించ పడుతూంది, ప్రాశ్చాత్య సంప్రదాయమే/అలవాట్లే కావున ఉదాహరణ కింద తీసుకోటం జరిగినది. ఇదే స్కేల్ ని ప్రాశ్చత్యానికి అనువదిస్తే, స్వేచ్చా జీవితం కనుక 1-5 వరకే వుంటుంది) విపరీతం గా ప్రేమించే వాళ్ళు ఎదురవుతారు. ప్రతి దినం ఏదో ఒక కొత్తదనం కావలి. విభిన్నత అంటే, చెవి కోసుకుని, ప్రాణం ఇస్తారు. వీళ్ళ ధోరణి చట్టపరమైన ఆంక్షలని పట్టించుకునేదిగా వుంటుంది. అంటే, వీళ్ళు చట్ట పరిమితికి లోబడి, ఆకర్షణకి లోకాబడిన పనులని చేస్తూ వుంటారు. చాలాసార్లు రహస్యం గా చట్టనిరోధ కార్యక్రమాలు చేస్తూనే వుంటారనుకోండి, కాని చెయ్యటానికి బయపడుతూ వుంటారు. అలా బయపడటానికి కారణం, తప్పు చేస్తున్నావు అని చెప్పే వాళ్ల అంతఃరాత్మ కావొచ్చు, చట్టపరంగా శిక్షని అనుభవించాల్సి వస్తుందని కావొచ్చు, లేకపోతే తల్లితండ్రులని మోసం చేస్తున్నామనే భావన కావొచ్చు. ఇలాంటి వాళ్ళు మన చుట్టుప్రక్కల చాలా మందే వుంటారు. మొన్న, రామసేన వాళ్ల చేత తన్నించుకున్నవారు ఈ కోవా లోకే వస్తారని (కేవలం) నా అభిప్రాయం. (మనవి: నిజమే, అందులో అందరు తప్పుడువాళ్ళే అని నేను కూడా అనటం లేదు. కళ్లు చెట్టు కింద నిలబడి పాలు తాగామంటే ఎవ్వరు నమ్మరు. స్థాన ప్రభావం మన మీద ఎదుటి వారికి కలిగే భావనని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. పదిమంది గుంపు లో 8 మంది జులాయి వెధవలు ఐతే, ఆ గ్రూప్ కి జులాయి గ్రూప్ అనే పేరు వస్తుంది కాని, "జులాయి గ్రూప్ ఇద్దరు తప్ప" అని ఎవ్వరు చెప్పుకోరు. గొప్ప ఔషదాన్ని చుక్క విషంతో కలిపితే, విషమే అవుతుంది కాని, దాని పూర్వ లక్షణాలు ఒక్కటి కూడా మిగలవు. చెడుకి మంచి మీద అంత స్వాదినత వుంది. దీనినే పెద్దలు, సావాస దోషం అని చెప్పారు. ఆ గ్రూప్ లో 1-2 మంచి వాళ్ళు వుంటే వుండొచ్చు గాక, కాని కాలక్రమేణా వారు కూడా రూపాంతరం చెందుతారు. దీనికి సరైన ఉదాహరణ కర్ణుడు. ఆయనలో ఎన్ని మంచి గుణాలున్న, ఎంత దానశీలత వున్నా, దుర్యోదనుడితో స్నేహంవల్లనే లోకం దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోయాడు. కాదనగలమా ? అవును, సావాస దోషం అంటే, ఒక కథ గుర్తుకి వచ్చిందండి.. సందర్భోచితం కాదుకాని, మంచి కధ. చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది. అనగనగ ఒక వూరిలో ఒక రాకుమారుడు (రాకుమారుడు రాజ్యం లో కదా వుండాలి అని చెత్త ప్రశ్నలు వెయ్యోద్దండి. ఏదో పని మీద ఆ ఊరికి వెళ్ళాడని సరిపుచ్చుకోండి). ఎక్కడికో ప్రయాణాం చేస్తూ, అడవి లో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు (అర్ధం అయ్యి అవ్వనట్టు వుంది కదా, సరే.. వాళ్ళ రాజ్యానికి back to pavillion అన్నాడు, దారిలో అడవి అడ్డం వచ్చింది.. సూపర్ హీరో కాదు కాబట్టి, జంప్ చెయ్యకుండా.. గుర్రం మీద దాటుతున్నాడు. ఇలా అయితే స్టొరీ పూర్తిఅవ్వదు చెప్తున్నా). ఇంతలొ ఒక కాకి, ఒక హంస అదే చెట్టు మీద వాలాయి. కొంచెంసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నై (ఏం మాట్లాడుకున్నై అని సందేహమా ? రాజకీయాలు అయ్యివుంటాయి.. మనకెందుకు చెప్పండి). రాకుమారుడి మీద ఎండ పడుతుంటే అయ్యో పాపం అని ఫీల్ అయ్యి, హంస తన రెక్కలతో నీడ పట్టింది. (యమదొంగ సినిమా లో జూనియర్ NTR కి ప్రియమణి కొంగు పట్టినట్టు) కాకికి నవ్వు వచ్చింది అది చూసి, అవసరమా నీకు అని అడిగింది హంసని. పరోపకారం చెయ్యటానికి కూడా పెట్టిపుట్టాలి అని శెలవు ఇచ్చింది, చెడ్డ వారితో ఎలా మసులుకోవాలో తెలియని మన హంసగారు. తిక్క కుదురుస్తా వుండు అని చెప్పి, కాకి ఆ రాకుమారుడి మీద రెట్ట వేసి, తుర్రుమంది. ఆ ఐటెం రాకుమారుడు లేచి కోపంగా పైకి చూస్తే, మేరీ మాత ఫోజులో వున్న మన హంస కనపడింది. కాకి రెట్టకి హంస రెట్ట కి తేడా తెలుసుకోటానికి వాడు, మీ అంత తెలివైనోడు కాదులెండి. ఫాస్ట్ గా, బాణం తీసాడు, గురి పెట్టాడు, కొట్టాడు. మన హంస స్పాట్ లో చచ్చిపోయింది. ఇక్కడ విషయం, హంస కూడా కాకిలాగా ఎందుకు ఎగిరిపోలేదన్నది కాదు (భహుశా వాడి మీద ఇంకా ఎండ పడుతుంటే, గొడుగు పడుతుందేమో పిచ్చి మొహంది), సావాసదోషం... కాకితో పాటు వున్నందుకే కదా మంచిదైన హంస మరణంచాల్సి వచ్చింది. ఇప్పుడు కథ కంచికి, మనం తరువాత paragraph కి.
స్కేల్ లో పైన చెప్పిన ఇదే స్థానం లోకి సంఘం లో వుండే నేరగాళ్ళు కూడా చేరుతారు. కాకపోతే ఒక్కటే తేడా, పై వాళ్ళు డబ్బు తగలేస్తారు సంతోషం కోసం, వీళ్ళు అదే డబ్బు ని సంపాదిస్తారు సంతోషం కోసం. మీరే ఆలోచించండి ఇంకా తేడాలు ఏమేమి వున్నాయో! నేరగాళ్లలో దేవుడిని నమ్మేవాళ్ళు చాలామంది వుంటారు.
వారిని మరి స్కేల్లో ఎడమవైపుకి ఎందుకు వేశావంటే, నా సమాధానం ఒక్కటే. వీరిలో, ధన/వస్తు/సుఖ వ్యామోహమనేది దేవుడిని, మన పూర్వికుల, ఆచారాల మీద గౌరవాలని అణిచివేసి, వాటి మీద ఆధిక్యతని కలిగివుంటుంది. ఇక, ఇదే స్కేల్ లో కుడి చేతి వైపుకి కదిలే కొద్ది, మనుషుల్లో దేవుడిని నమ్మే వారి సంఖ్యా కూడా పెరుగుతుంది. (గమనిక: నేను చెప్తున్నది అంతా, ఆ శ్రేణి లో వుండే అధికుల గురించి. ఇలాంటి విషయాలలో ఆక్షేపణలు చాలా వుండొచ్చు, కాని సహజం గా జరిగేవాటిని గురించి ప్రస్తావిస్తున్నానని గమనించవలసినది గా ప్రార్దన.. మరో చిన్న గమనిక: ఈ బ్లాగ్ లో దేవుడిని నమ్మటం అనేదానిని నా పరిమిత జ్ఞానం వల్ల విరివిగా వాడటం జరిగింది. పోస్ట్ మొత్తం చదివినా సరే clarification, justification లభించక, అభ్యంతరంగా అనిపిస్తే.. బాలయ్య విన్యాసాలు చూసి నవ్వుకుని వదిలేసినట్టు వదిలెయ్యమని ప్రార్ధన.).
కుడి వైపుకు, చిట్ట చివరున, అంటే 10 కి దగ్గరలో, ఈ చాందసవాదులు గా పిలవబడే వర్గం.. వీరు కొత్త వాటిని జీర్ణించుకోలేరు. ప్రతి నూతన పోకడ కి ఒక అనర్దం, ఉపద్రవం వెనకంటే వుంటాయని వీళ్ళ గొప్ప నమ్మకం (కొంతమందికి అనుభవం కూడా అయ్యి వుండొచ్చు). వారు నమ్మి, అనుసరించే పద్దతులు తప్పితే, వేరే వాటిని అస్సలు నమ్మరు. ఆ కొన్ని పద్దతులనైన వీళ్ళు ఎలా నమ్ముతున్నరాయ అంటే, పెద్దలనుంచి సంక్రమించింది. వాళ్ల పెద్దలు అనుసరించిన సాంప్రదాయాలు, పద్దతులే వీరికి ఎక్కువ నేర్పుతాయి. వీరి వల్ల సంఘానికి మంచి వున్నా, వీరి కుటుంబానికి మాత్రం నరకం. మంచి ఏంటా అని ఆలోచిస్తున్నారా ? ఏమి లేదండి. మన సంస్కృతీ ( సంస్కృతీ కి చాలా అర్దాలు వున్నాయి. దాని అర్దాల మీద ఒక పెద్ద గ్రంధాన్ని రాయొచ్చు కాని, ప్రస్తుతానికి అందరు అంగీకరించిన ఒక అర్దాన్ని తీసుకుని, సంతృప్తి పడదాం. సంస్కృతి అనగా, ఒక సమాజం చేత తరతరాలుగా పరస్పర కృషితో అభివృద్ది పరచబడి, ఆ సమాజాన్నే కొన్ని నిర్దేశిత గమ్యస్థానాల వైపు నడిపించే, ఆచారాల, విలువల, వ్యవహారాల, అలవాట్ల(మో||) సముహారం.) ని అంతమవ్వకుండా కర్కశం గా కాపాడేవాళ్ళు వీళ్ళే. యమ భగవానుడంటె ఎవ్వరికీ ఆరాధ్య దైవం కాదు, కనీసం పూజలు కూడా చెయ్యరు. కాని ఆయన లేకుంటే, పాపభీతిని వూహించగలమా ? నిజానికి దేవుడిని నమ్మటం వల్ల కలిగే గొప్ప లాభాల్లో ఒకటి ఈ పాపభీతి. ప్రాశ్చాత్య సంస్కృతీ లో దేవుడిని పాపక్షమాపణ కోరుకుని, విముక్తి పొందే వేసులబాటే, ఆ సంస్క్రితికి విచ్చలవిడి స్థితిని తీసుకువచ్చిందని నేను నమ్ముతాను. మన హైందవ సంస్కృతీ లో కూడా చెంపలు వేసుకోటం, గుంజీళ్ళు తీయటం లాంటివి పాపా పరిహారణ కింద వున్నవి కదా అని మీరు వాదించవోచ్చు. అవును నిజమే, కాని ఎక్కడ కూడాను, చెంపలు వేసుకుంటే పాపాలన్నీ హరింపపడతాయని చెప్పలేదు. అవి చిన్న చిన్న తప్పులకి, చిన్న చిన్న ప్రాయశ్చిత్తాలు. హిందువుల్లో పాప, పుణ్యాల లెక్కలు అంతా చనిపొయినాకే. అందుకే, 10 మార్కుల పాపం చేస్తే, 15 మార్కుల పుణ్యాలు చెయ్యాలని చూస్తారు మనవాళ్ళు (అందరు కాదులెండి, కర్మ సిద్దాంతాన్ని నమ్మేవాళ్ళు). నాకు కొన్ని తప్పులకి మన పురాణాల్లో (దండనీతీశాస్త్రం అని ప్రత్యేకం గా ఒక శాస్త్రం వుందండి) పేర్కొన్న కొన్ని ప్రాయఃశ్చిత్తాలు తెలుసును, అవి చూసి ఎంత కఠినమో మీరే గ్రహించండి. మద్యపానం, గురుపత్నిని ఆశించటం, విప్రుని చంపటం, విప్రుని దనాన్ని అపహరించటం, మరియు ఇవి చేసినవాడిని ఎదిరించకపోటం.. ఇవన్ని పంచమహాపాతకాలు. ఇందులో మొదటిది, చివరిది ఈ కాలంలో చాలా సహజంగా జరుతున్న పనులు. మద్యపానాన్ని.. గురుపత్నిని ఆశించటం మరియు ఒక హత్య ని చెయ్యటంతో పోల్చారండి. ఐనా, మందు తప్ప తాగి.. మనది కాని జీవితంలో, మనది కాని లోకంలో బతకటం ఏంటి చెప్పండి. మీకు అంతగా బోర్ కొట్టి, ఒక కొత్త జీవితం/కొత్త అనుభూతులు కావాలంటే, అందుకోసం చాలా మార్గాలు వున్నాయండి, తాగనక్కర్లేదు.. ఏమంటారు ? తాగటం అంటే, మనం ఎంతగానో ప్రేమించే మన జీవితంలో కొన్ని అపురూపమైన ఘడియలని కోల్పోవటమే. ఆ అనుభూతిని కూడా ఎందుకు వదులుకోవాలి, పోయేవి కొన్ని గంటలే కదా అంటారా ? మీరు స్కేల్ లో 3-4 మధ్యలో వుంటారు :P
సరే, back to topic.. ఇక చాందసవాదుల కుటుంబానికి నరకం ఎందుకో ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. వీరు మార్పు ని స్వీకరించకపోగా, వీరితో పాటు జీవించే వాళ్ళు కూడా అనుసరించుటకు అవరోధం అవుతారు. కాలం తో మారకపోవటం/ మారలేకపోవటం వీళ్ళ సమస్య. కాదు, వీరితో పాటు జీవించే వాళ్ళకి సమస్య. నా దృష్టి లో వీరు సంఘాభివృద్ధి కి తోడ్పడకపోవచ్చు గాక, కాని వీరినుంచి చెడు మాత్రం వూహించజాలనిది (ఎందుకంటె, వీరు అనుసరించే చాలా ఆచారాలు ఎప్పటినుంచో అనుక్షణం పరిశీలించి, మార్పులు ఆవశ్యకం అను చోట అభివృద్ది పరచబడినవి. అవి ఇన్నాళ్లుగా సత్ఫలితలని ఇస్తూనే వస్తున్నాయి). కాని, వీళ్ళ ఆలోచన సరళి లోనే, ఒక ప్రధానమైన లోపం కనిపిస్తుంది. ఇప్పుడు వారు అనుసరిస్తున్న ఆచారాలు మొదటినుంచి ఇలా లేవని, కాలానుగుణంగా మారుతూ వచ్చాయని వాళ్ళు తెలుసుకోవాలి. ఇలాంటి వారు ఇప్పుడు బహు అరుదు అని నా ఉద్దేశ్యం, వున్నా మనలాంటి hitech జనాలకి బూతద్దం పెట్టుకు వెతికినా కానరాని చోట్ల వుంటారు. ఎప్పుడూ కుడి దిశ లోనే పోతావా అని కోప్పడకండి, కుడి అనేది హిందువలకి పవిత్రత అని సెంటిమెంట్. సరే, మీ కోరిక మీద ఈ సారి మనం ఎడమ చేతి వైపు పయనించబోతున్నాం ;) ఇక 5-7 శ్రేణి లో వుండేవాళ్ళు దేవుడిని నమ్ముతారు, తరతరాలనుంచి మనకి సంక్రమిస్తున్న విధివిధానాలని, కట్టుబాట్లని ఆచరించటానికి పెద్దగా విముఖత కనిపించదు.. అదే విధంగా కొత్తదనాన్ని కూడా ఆహ్వానిస్తారు. (చిన్న గమనిక: ఈ బ్లాగ్ లో దేవుడిని నమ్మటం అనేదానిని నా పరిమిత జ్ఞానం వల్ల విరివిగా వాడటం జరిగింది. పోస్ట్ మొత్తం చదివినా సరే clarification, justification లభించక, అభ్యంతరంగా అనిపిస్తే.. బాలయ్య విన్యాసాలు చూసి నవ్వుకుని వదిలేసినట్టు వదిలెయ్యమని ప్రార్ధన. ) వీరు ఒప్పుకునే కొత్తదనం, చాలా సందర్బాలలో innovations/టెక్నాలజీ సంబంధితాలు అయ్యి వుంటాయి. అనగా, మనిషి జీవితాన్ని సౌలభ్యకరంగా రూపుదిద్దెవన్నమాట. వీరు చాలావరకు ఫ్యాషన్ లో కొత్త పోకడలకి వ్యతిరేకం. పల్లెటూరులలొ, బస్తిలలో ఇలాంటివారిని అధికంగా చూడవచ్చు. ఇక 5 కి అటు ఇటు గా వుండే జనాలు ఎలా అలోచిస్తారంటే, మన పూర్వికులు చెప్పిన వాటిని 1+1=2 లా చూడకుండా, ఇప్పుడు కూడా వాటి వల్ల వొరిగే మంచి ఏమైనా వుందో లేదో బేరీజు వేసుకోవాలి అంటారు. వారి కాలంలో వారు ఆచరించినవాటికి ఏదో ఒక మంచి వుద్దేశ్యం వుండి ఉండొచ్చు, కాని అది మారుతున్న కాలానికి అనుగుణంగా వుండాలని ఏమి లేదు కదా, అందరికి బ్రహ్మంగారి కాలజ్ఞానం తెలియాల్సిన అవసరంలేదు కదండీ. అలాగే ప్రాశ్చాత్య పద్దతులని కూడా పూర్తిగా గుడ్డిగా అనుసరించటం కాకుండా.. మనమేంటి, మన భారతీయుల ప్రత్యేకత ఏంటి అనే వాటిని దృష్టి లో పెట్టుకుని, అంచానా వేసి.. అన్ని విధాలుగా మంచి అనిపిస్తే అనుసరించండి, మన తరువాత తరాలకి మంచిని (మంచినే) అందివ్వండి. ఒక్కోసారి innovations/టెక్నాలజీలో కూడా చెడు వుండొచ్చు, ఆలోచించండి. సంక్లిప్తంగా, పనికి రాని పాత ని వదిలెయ్యండి.. మంచి కొత్తని ఆహ్వానించండి. నా ఇష్టం, నా జీవితం అని గుడ్డిగా ఏ పనిని చెయ్యకండి. అది మనతో పాటు, మన తరువాత తరాలని కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకి, పెట్రోల్ వాడకం. పెట్రోల్ మూలాలు పున్రోత్పతి జరగటానికి కూడా వీలు లేకుండా, వాడేస్తున్నాం. మన విపరీత చర్యలు వల్ల, తరువాత తరాలు అస్సలకి బతకాటానికి కూడా అవకాశం లేని పరిస్థితిని కలిపిస్తున్నాం. అలా కాదు.. నాకు నేడు నేను ఎలా గడిపానో ముఖ్యం అంటారా, రేపు అనేది రేపటికి నేడు అవ్తుందండి. అది ఆలోచించారా ?
సరే ఇంత సొల్లు మాట్లాడుకుంటున్నాం కదా, దేవుడి మీద, ఆయన అస్తిత్వం మీద కొంచెంసేపు ఆలోచిద్దాం.
మనలో దేవుడి అస్తిత్వాని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది వుండొచ్చు . సైన్సు ని నమ్మేవాళ్ళు జనరల్ గా దేవుడిని మనసార నమ్మరు. కాని, నమ్మితే వచ్చే తప్పు ఏంటి ? సైన్సు సమాధానాలని కనుక్కొలేకపొయిన ప్రశ్నలనుంచి దైవం అనే భావం పుట్టింది. ఆ ప్రశ్నలకి ఇంకా మనం సమాధానాలని వెతుకుతునేవున్నాం. వెతికినంతకాలం దైవాన్ని బతికిద్దాం. దేవుడ్ని నమ్మటం వల్ల కలిగే ఇంకో లాభం చెప్పనా.. నమ్మకం కలుగుతుంది, మన మీద మనకి నమ్మకం పెరుగుతుంది. నా మటుకు నాకు, దేవుడికి ఒక దణ్ణం పెట్టుకుని, పరీక్షకి వెళ్తే, పేపర్ అంతా చదివినవే వస్తాయనుకుంటా. కానీ జరిగేది అది కాదు, నా మీద నాకు నమ్మకం పెరుగుతుంది, నాకేంటి అంతా దేవుడు చూసుకుంటాడని ప్రశాంతంగా పూర్తిచేస్తా పరీక్షని. ఇప్పటివరకు అన్ని విజయాలే మరి. అలా అని, దేవుడికి దణ్ణం పెట్టి, గాల్లో దీపం పెట్టమనటంలేదు. మన కృషి ని మనకి తెలియచెప్పే ఒక సాధనం దేవుడు. మనకి ప్రశాంతత చేకూర్చే సాధనం దేవుడు. దానిని మంచి చేసే ఒక టెక్నాలజీ కింద పరిగణించండి, తప్పు లేదు.
ఇంతకి రామసేన వాళ్ళు చేసింది తప్ప, ఒప్పా ? తొందర పడకండి, ఇప్పుడు అదే మనం చర్చించబోతున్నాం. చర్చ ఏంటి నీ మొహం, అన్ని నీ ఆలోచనలు, అభిప్రాయాలే గా అంటారా.. హిహి, ఇంతకుముందే చర్చకి తెర లేపి, తల మీద తడి గుడ్డ వేసుకున్నా :) ఇప్పుడు విషయానికి వస్తే, ఈ బ్లాగ్ చదివే చాలా మంది స్కేల్ లో 5 కి కిందనే వుంటారు. కొంతమంది 5 కి అటు వైపు వుండొచ్చేమో గాని, మరీ దూరం ఐతే వెళ్ళలేరు. ఇప్పుడు రామసేన వాళ్ళ ప్రయత్నం 5కి ఎడమవైపు వాళ్ళకి నచ్చదు, కుడివైపు వుండేవాళ్ళకి నచ్చుతుంది. ఇంక, 7 పైన వుండేవాళ్లకి, వాళ్ళు చేసిన పనులు కూడా నచ్చుతాయి. నేను రామసేన నీ కొంత వరకు సమర్దిస్తున్నానని ముందే తెలియబర్చుకున్నాను, కాని, ఆడపిల్లలని పట్టుకు తన్నటం మాత్రం, ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. (ఇక్కడ అసంధర్బమైనా, ఒక విషయం చెప్పాలి. ఒకప్పుడు నేను RSS అనుచరుడుని. దాని ప్రభావం నా మీద కాదనలేనిది).. పబ్స్ కి వెళ్ళటం పూర్తిగా తప్పు, చెయ్యకూడని పని అని నేను కూడా అనటం లేదు. మనిషి మనస్సుకి కట్టుబాట్లు ఏమాత్రం అడ్డం కాదు అని నాకు తెలుసు. కాని ఆ కట్టుబాట్లు అనేవి, వూరికే ఏమి లేవు కదా.. ఒక కారణం వుంది వాటి వెనుక.. అది తెలుసుకుని, కాలానుగుణంగా మంచి జరుగుతుందనుకుంటే కట్టుబాటుల్లో కొంచెం వెసులుబాటుని కలిపించండి, వాటినే మన తరువాతి తరాలకి అందించండి. పబ్స్ కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, కాని మనం చేస్తుంది ఎంతవరకు సమంజసమో బుద్ధితో అలోచించండి, మనస్సుతో కాదు.
మీ,
నాగాస్.
lol. చిన్నప్పటినుంచి టెక్స్ట్ బుక్స్ లో biographies చదివి చదివి, intro తరువాత బాల్యం అని sub heading తో paragraph వస్తుందని, అలా fix అయ్యిపోయా. ఇప్పుడు నా బ్లాగ్ లో కూడా, నాకు తెలియకుండా అదే టైటిల్ పెట్టేసా :) ఎహె, ఈ సొల్లు ఎందుకు, వెళ్లి change చెయ్యొచ్చు కదా అంటారా, ఒక్కసారి fix అయితే నా మాట నేనే వినను :P ఈ మధ్య ఈ పోకిరి dialogues గొడవ చాల ఎక్కువ అయ్యిపోయిందండి. డ,డి,డు, బాష మాట్లాడే ఈ naagas గాడు sudden గా అండి, గిండీ, అంటున్నాడేంటి అని ఆలోచిస్తున్నారా ? అదే మరి, రామాయణం లో పిడకల వేట అంటె, సైడ్ ట్రాక్ తీసుకోకుండా, actual టాపిక్ మీద concentrate చెయ్యమని మనవి. ( పని లో పని, చిన్న anouncement, ఇక పైన నేను గౌరవ వాచకలే వాడాలని, strong గా decide అయ్యానండి. కారణాలు ఏమి అయ్యి వుండొచ్చు అని, జుట్టు పీక్కుని, నేను పోగుట్టుకున్నట్టు పోగొట్టుకోకండి. నేనే చెప్తాలెండి బ్లాగ్ లో space చూసుకుని.) ( main track.. main track.. ??) ఎస్, పోకిరి.. హ.. ఈ పోకిరి గొడవ మాములుగా లేదండి. పూరి జగన్నాథ్ గారు ఏ నిమిషం లో రాసారో గాని, ప్రతోడు అడ్డ దిడ్డం గా use చేసి పారీస్తున్నాడు. ఉదాహరణానికి, ఎవడైనా ఏదైనా చెయ్యమని అడిగితే, నేను ఒకడు చెబితే చెయ్యను, చెయ్యాలనిపిస్తే చేస్తా అంటున్నారు. ఇంకొకటి, అన్నయ్య అని సంభోదన. అన్నయ్య, [ఏంటి ఇది, ఎవరీడు, ఏడికి] ? ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ. ఈ స్టైల్ ని వీడు complain చేస్తున్నాడు, వీడు follow అవ్వడేమో అనుకుంటే, పప్పు లో కాలే కాదు, total గా మునిగి, స్విమ్మింగ్ చేసినట్టే. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏమనగా, గొడవలు అయినా పర్లేదు, పూరి జగన్నాథ్ గారు ఇంకో క్యారెక్టర్(పోకిరి రేంజ్ లో ) మనకి ఇచ్చేంత వరకు, మీరు కూడా same స్టైల్ ని follow అయ్యిపొండి చెప్తా! ;) వెయిట్ వెయిట్. నన్ను కొంపతీసి మహేష్ బాబు ఫ్యాన్ ని అని misunderstandings గట్రా లాంటివి చేసుకోమాకండి. నా చిన్నప్పుడు నా cousins influence వల్లనైతేనేం, మా క్రోసూరు theatre లో ఎక్కువ రోజులు బాలకృష్ణ మూవీస్ ఆడటం వల్లనైతేనేం, మా పెద్దోళ్ళు NTR ఫాన్స్ అవ్వటం వల్లనైతేనేం (అస్సలకి CNB వప్పుకోడేమొ గాని, ఛాన్స్ ఇస్తే మా తాతే NTR ట్రూ follower ;)) మనం కూడా బాలయ్య ఫ్యాన్! ( ఇప్పుడు ఐతే అలా చెప్పుకోటానికి సిగ్గు పడుతున్నాం గానీ, నేను 10th చదివినంత వరకు, గొప్ప గా చెప్పుకోనేవాదినండి, చిరు కంటే బాలయ్య too much అని. తరువాతే తెలిసింది బాలయ్య నిజంగానే too much అని ) చిన్నప్పుడు అంటె గుర్తుకు వచ్చిందండి, అస్సలకి నేను టాపిక్ స్టార్ట్ చేసింది నా బాల్యం గురించి కదా.. అయ్యయ్యో, మనకి ఈ రోజు ముహూర్తం సరిగా లేనట్టుంది, ఇంకో రోజు నా బాల్యం గురించి సవివరం గా, ఎలాంటి మళ్ళింపులు లేకుండా, మీ ముందు వుంచుతాను.(అస్సలు, నిన్ను ఎవడు రా అడిగాడు నీ బాల్యం గురించి అని మాత్రం అడగకండి, naagas ఫీల్ అవతాడు). ఒకే మరి, అప్పటి వరకు, జాగ్రత వహించండి. ( ఏంటి, నేను garnier కి brand ambassador అనుకుంటున్నారా ? అదేదో సినిమా లో Mr. నితిన్ రెడ్డి గారిలాగా సైకిల్ ambassador కి ఏమైనా సరిపోతనేమో గానీ, అంతకి మించి సీన్ లేదండి.) అది just, take care కి ట్రూ తెలుగు translation :)
మీ,
naagas.
చిన్న విన్నపం: తెలుగు వికీ అని ఒక గూగుల్ గ్రూప్ వుంది, దయచేసి అందులో జాయిన్ అయ్యి, మీ contributions అందించవల్సినది గా ప్రార్దన. contribution (అంటే, మనీ కాదు బయపడకండి) కష్టం అంటారా ? సరే, atleast జాయిన్ అవ్వండి, రోజు తెలుగు లో ఒక వ్యాసం మీ మెయిల్ అడ్రస్ కి వస్తుంది.
చిరునామా: http://groups.google.com/group/teluguwiki
నమస్తే,
ఎందుకో ఈ రోజు నాకు కూడా blogging చెయ్యాలనిపించింది (last two days లో చాలా ఎక్కువ blogs చదివాను, may be inspire అయ్యానేమో! నన్ను inspire చేసిన blogs ని links లో add చేస్తానులెండి. ). ఇన్నాళ్ళు చాలా blogs వున్నాయ్ కదా, వాళ్ళ views చదవటానికే మనకి టైం లేదు అని ignore చేస్తూ వచ్చాను. అలాగా, మరి ఇప్పుడు ఎందుకు అనిపించిందయ్యా నీకు sudden గా అంటే, రెండు కారణాలు వున్నాయ్. ఒక్కటి, స్వచ్చమైన తెలుగు లో వున్న blogs చాలా తక్కువ. రెండోది అందరు naagas కాదు కదా ;) వాళ్లవి, వీళ్ళవి, అభిప్రాయాలు చదివి నేను తెలుసుకోటం తప్ప, నేను ఏంటి, నా అభిప్రాయాలు ఏంటి.. అనేవి చాలా మంది కి తెలియకుండా పోతున్నాయి. నా అభిప్రాయలు నాలోనే నిక్షిప్తమై వుండి, కాల గమనం లో నాకు కూడా తెలియకుండా అంతమై పోవాలా ? 10 years తరువత నా లైఫ్ లో నేను నేర్చుకున్నవి, నేను చేసినవి, చూసినవి, అనుభవించినవి, feelings ఏంటి అని నా మనస్సు ని అడిగితే, అది brain లో వున్న programming languages semantics తప్పితే ఏమి చూపించలేకపోతుందేమో అనే భయం. అలా జరగనే కూడదు, నా ఇంటర్ లో నేను రాసిన కవితలు, ఇంజనీరింగ్ లో రాసిన నోవెల్, చిన్నప్పుడు గీసిన బొమ్మలు, 9th లో రికార్డు చేసిన మాటల సినిమా ఇవన్ని ఎప్పటికి మననం చేసుకోవాల్సిన విషయాలు. అవి, నా బిజీ లైఫ్, కెరీర్ వాళ్ళ మిస్ అవ్వకూడదు. వాటికోసం ప్రత్యేకం గా time spend చెయ్యకపోయినా పర్లేదు, atleast వాటిలో నాకు ప్రవేశం వుందని అయినా గుర్తు వుండాలి కదా. నా ఈ ప్రయత్నం లో success అవ్వాలని దేవుడ్ని కోరుకుంటూ..
మీ,
Naagas.
ఎందుకో ఈ రోజు నాకు కూడా blogging చెయ్యాలనిపించింది (last two days లో చాలా ఎక్కువ blogs చదివాను, may be inspire అయ్యానేమో! నన్ను inspire చేసిన blogs ని links లో add చేస్తానులెండి. ). ఇన్నాళ్ళు చాలా blogs వున్నాయ్ కదా, వాళ్ళ views చదవటానికే మనకి టైం లేదు అని ignore చేస్తూ వచ్చాను. అలాగా, మరి ఇప్పుడు ఎందుకు అనిపించిందయ్యా నీకు sudden గా అంటే, రెండు కారణాలు వున్నాయ్. ఒక్కటి, స్వచ్చమైన తెలుగు లో వున్న blogs చాలా తక్కువ. రెండోది అందరు naagas కాదు కదా ;) వాళ్లవి, వీళ్ళవి, అభిప్రాయాలు చదివి నేను తెలుసుకోటం తప్ప, నేను ఏంటి, నా అభిప్రాయాలు ఏంటి.. అనేవి చాలా మంది కి తెలియకుండా పోతున్నాయి. నా అభిప్రాయలు నాలోనే నిక్షిప్తమై వుండి, కాల గమనం లో నాకు కూడా తెలియకుండా అంతమై పోవాలా ? 10 years తరువత నా లైఫ్ లో నేను నేర్చుకున్నవి, నేను చేసినవి, చూసినవి, అనుభవించినవి, feelings ఏంటి అని నా మనస్సు ని అడిగితే, అది brain లో వున్న programming languages semantics తప్పితే ఏమి చూపించలేకపోతుందేమో అనే భయం. అలా జరగనే కూడదు, నా ఇంటర్ లో నేను రాసిన కవితలు, ఇంజనీరింగ్ లో రాసిన నోవెల్, చిన్నప్పుడు గీసిన బొమ్మలు, 9th లో రికార్డు చేసిన మాటల సినిమా ఇవన్ని ఎప్పటికి మననం చేసుకోవాల్సిన విషయాలు. అవి, నా బిజీ లైఫ్, కెరీర్ వాళ్ళ మిస్ అవ్వకూడదు. వాటికోసం ప్రత్యేకం గా time spend చెయ్యకపోయినా పర్లేదు, atleast వాటిలో నాకు ప్రవేశం వుందని అయినా గుర్తు వుండాలి కదా. నా ఈ ప్రయత్నం లో success అవ్వాలని దేవుడ్ని కోరుకుంటూ..
మీ,
Naagas.