yes man's laptop

ఇప్పుడు మీకు ఒక విషాదకరమైన సంఘటన ఒకటి చెప్పబొతున్నానండి. గుండె నిబ్బరం చేసుకుని చదవండి. ఇంతకుమునుపు ఎప్పుడైన సినిమాలు చూసి ఏడ్చిన flashbacks గనుక మీకు వుంటె వెంటనే ఈ టపాని మూసెయ్యండి (మనకి అలాంటివి మూడు వున్నయిలేండి. ఒకటేమో చిన్నప్పుడు రాజెంద్రుడు గజెంద్రుడు లో ఎనుగుని కొట్టె సన్నివేశంలొ. ఇంకొటి recent గా ఆకాశమంతా లొ. ఏంటి, ఆ సినిమాని చూసి కూడా ఎడ్చేవాళ్ళు వుంటారా అని questioning చేసి insult చెయ్యకండి. ఖచ్చితంగా వుంటారు, exampleకి నేనే. అస్సలు, నేను కొంచెం లొ కొంచెం నయ్యం, మా friend గాడు ఐతె ఏకంగా యొగి సినిమా చూసి ఎడ్చెశాడు. ఊర్వశి శారద, మన 8ప్యాక్ ప్రభాస్ కలిసి dance వేస్తుంటె మనోడి కళ్ళల్లొ, ఆ mother sentiment కి, గంగ అలలు.. ఈలలు వేసుకుంటు, గొలలు చేసుకుంటు, అలా అలా ఏగురుకుంటు, దొర్లుకుంటు, పాకుకుంటు, డాన్సులు కట్టేశాయి. నేనే ప్రత్యక్ష సాక్షి.
మీరు: తమ్ముడు.. ప్రాసల కోసం ప్రాకులాడకుండా, నువ్వు ఏడ్చిన మూడొ సినిమా పేరు చెప్పమంటారా ?
నేను: ఎమో, సరిగ్గా గుర్తుకులేదండి. కాసేపు little soldiers అనేసుకొండి :D. సొల్లు ఆపేసి.. pointకి రారా బాబు అనబోతున్నారు కదా, మీకు ఆ చాన్స్ ఇవ్వనండి, ఇదిగో ఆడికే వచ్చేస్తున్నా.

ట్రింగ్, ట్రింగ్... ఒక టార్టాయిస్ కాయిల్ తీసుకుని, 10రోజులు వెనక్కి తిప్పండి. తిప్పిన తరువాత, గూగుల్ మాప్స్ తెరిచి, గప్పున మా ఆఫీస్కి వచ్చెయ్యండి. అడ్రెస్ తెలియదా ? చీ చీ, మా ఆఫీస్ అడ్రెస్ కూడా తెలియదంటే, మీరు తప్పకుండా జనరల్ నాలేడ్జ్ లో వీకు అయ్యివుంటారు. సర్లే.. బెంగుళూరులో మారతహల్లి దగ్గర వైటింగ్ చెయ్యండి, మన స్టోరి అక్కడికే వచ్చేస్తుంది,
మీరు: వ్వావ్.. ప్రజల వద్దకు పాలనలా.. వినేవాళ్ళ దగ్గరికి కథలన్నమాట. శేభాష్.
నేను: తెలుగు బాషలో నాకు నచ్చని రెండు పదాలు. ఒకటి హింది. రెండొది పొగడ్త. సో, మూసుకోండి. సరే, దేనికైనా పరిచయ వాక్యాలు తప్పనిసరి కాబట్టి, అలా చెప్పటం మంచి పద్దతి కాబట్టి, నేను మంచి కుర్రాడిని కాబట్టి.. చదువుకొండి. ఆగండాగండి, ఏమంటిరి, ఏమంటిరి.. నా అనుభావాన్ని, కట్టుకధ అంటిరా.. అహో, ఎంతటి అవమానం, ఎంతటి అవమానం. ఇంత జరిగినా నేను జీవించియుండితినా.. సర్లె, ఈ టపా రాసేసి, ఆత్మహత్య ఎలా చేసుకోవాలొ బొక్కులు దొరుకుతాయంటా, కొనుక్కొచ్చుకుని చదువుకుంటా.

ఈ మధ్యే, jim carrey గాడి yes man అనే సినిమా చూడటం జరిగింది. వాడి తరహ సినిమాలా కామేడిగా లేకపొయినా, మా పోరగాళ్ళకి నచ్చకపొయినా కూడ, నాకు నచ్చేసింది. ఎంతగా నచ్చేసిందంటె, ఉత్తేజితున్ని అయ్యిపొయి, వాడిలాగా కొన్ని రొజులు గడుపుదామని నిశ్చయించుకున్నా. అంతగా ఎందుకురా inspire అయ్యావ్ అని మాత్రం అడగకండి. ష్ ష్.. రహస్యం అది.
మీరు: ప్లీజు ప్లీజూ, చెప్పరాదు, నీకు పుణ్యముంటుంది.
నేను: ఎహే.. రహస్యమంటే చాలు, ప్రతోడికి ఎక్కడాలేని ఉత్సాహం... పాడేమీద పీనుగ కూడా లేచి కుర్చుంటుంది. ఎముంది, నా బొంద, ఈ కాలం కుర్రాళ్లకి ఇంట్రస్ట్ అంటే ఎందుకొస్తుంది ? గర్ల్ ఫ్రెండ్ కోసం.. yes man లా వుంటేనే, jim carreyకి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.
మీరు: ఒరేయ్.. నీ పిచ్చితో, మాకు యెర్రెక్కుతుంది. అది సినిమా రా.. ఎమైనా జరుగుతుంది.
నేను: తొక్కలోది, నేను ఆ మాత్రం అవకాశం కూడా వదులుకోదల్చుకోలేదు.
మీరు: బిడ్డా! desperationలో వున్నట్టు వున్నావ్. పోయి పోయి పులినోట్లో తలపెడతానంటావేంటిరా ?
నేను: పక్కోడు, గర్ల్ ఫ్రెండ్ ని పక్కనేసుకుని, షికారుకోడుతున్నప్పుడల్లా.. అల్రేడి, పులి కడుపులో జీర్ణమవుతున్నట్టు వుంటుంది. దీనికంటే అదే బెట్టర్!
మీరు: ఇంత ఎడుపెందుకు, ఒక అమ్మాయిని బుట్టలో వేసుకొవచ్చుగా అప్పుడు.
నేను: చ.. వాళ్ళెమన్నా, నైకి షోరూమ్ లో షూలా.. వెళ్ళి వెసుకొచ్చేయటానికి. అయ్యినా అవకాశాలు ఎక్కడిస్తున్నారు. రోడ్ మీద అందంగా కనిపించిన పోరిని ఒకదాన్ని ఆపి, కాఫికి పిలుద్దామని వైటింగ్.. కళ్ళు కాయలు కాసి, మగ్గిపోయి పళ్ళుకూడా అయ్యాయి. మా వీధి చివరి ముసలవ్వ, మారుబేరానికి అమ్మినా అమ్ముతుంది ఆ పళ్ళని.. ఇంత వైటింగ్ చేసి, మా ఫ్రెండ్ గాడి కళ్ళుకూడా కలిపి నాలుగు కళ్ళతో గాలించినా కావల్సిన అమ్మాయి దొరకటల్లా.
మీరు: ఏం.. బెంగుళూరు లో అమ్మాయులు బాగో..
నేను: ఛస్.. కళ్ళుపోతాయ్.. ఆ మాటన్నావంటే.. దీన్ని గ్రీన్ సిటీ అన్నోడికి కళ్ళు లేవేమో బహుశా. నా కళ్ళతో చూడమను, ఎన్ని కలర్లో. కలర్స్ సిటి అని పెట్టేవాడిని నేనైతే. హైదరాబాద్ 16bit colour display ఐతే, బెంగుళురేమో, 64bit. నేను ఎంత అద్రుష్టవంతుడ్నంటే, 1bit display లాంటి, కాలేజినుంచి బెంగుళురు వచ్చిపడ్డాను. ష్చ్.. ఐనా ఎం లాభం. ఇంకా ట్రైలర్స్ చూస్తునే కుర్చుంటున్నా.
మీరు: డబల్ మీనింగ్ మాటలు బాగా పేలుతున్నావే?
నేను: అలా అనిపించిందా? ఐనా చదివే పద్దతి మీద వుంటుందమ్మా. హీరోయిన్లు చెప్పినట్టు, ఎక్స్ పోజింగ్లో గ్లామర్ని చూడాలిగాని, వల్గారిటిని కాదు. అలానే ఇది కూడా.
మీరు: సరే.. ఇంతకి, అమ్మాయిలు కూడా బాగుంటె, ఇంక నీ సమస్యేంటి మరి ? డాక్టర్..
నేను: ఆపేయ్యండి అక్కడ.. మీరు ఏం చెప్పదల్చుకున్నారో నాకు అర్దం అయ్యింది. మేము కూడా స్వాతి వీక్లి చదువుతాం. అలాంటివి ఏంలేవు.. అయ్యినా పోర్లు బావుంటే సరిపొతుందా.. ప్రతి చర్యకి ప్రతిచర్య వుంటుంది అనే న్యూటన్ సూత్రాన్ని తప్పు అని నిరూపించటానికి, దేవుడు వీళ్ళని పంపినట్టువున్నాడు. అరే, ప్రతి ఒక్కది, ఒక తొక్కలొ సెల్ ఫోనెసుకుని, గంటలు గంటలు మాట్లాడుతునే వుంటుంది. ఇలాంటోళ్లని డోక్కలో పెట్టి తన్ని, చిక్కకుండా పరిగెత్తాలి. అరే, ఇంత బిజిగా, పని కూడా మానుకుని ఒకడు నాకు ట్రై చేస్తున్నాడే, ఇష్టపడుతున్నాడేమో, లేక ప్రేమిస్తున్నాడేమో, అందుకే ఇంత కష్టపడుతున్నాడేమో.. పోని ఒక మాట అడుగుదామా అని లేకుండా.. వో, సెల్ ఫోన్తో కాపురాలు చేస్తుంటారు. అస్సలకి నాకు మన్మధుడు సినిమా చూసినప్పుడు మొదలయ్యిన డౌటండి, వీళ్లల్లో వీళ్ళు అంతసేపు ఎం మాట్లాడుకుంటారో ? ఆ సినిమాలో డౌట్ ఐతే క్రియెట్ చేశాడుగాని, సాల్వ్ చెసియెడ్వలేదు. బహుశా వాళ్ళకి కూడా తెల్వదేమో పాపం.
మీరు: నేను అమ్మాయినే.. ఎంటి ఎదో వాగుతున్నావ్ ?
నేను: నిజమా అక్కా ? అబ్బే, నిన్ను కాదక్కా.. నిన్ను అంటే నాకేటొస్తది చెప్పు. నేనేదో, మా ఇంటికాడ, ఒకమ్మాయి గురించి చెప్తున్నా.. అయ్యినా ఇదంతా వుళ్ళుళ్ళుళ్ళుళ్ళా.. వుత్తిదే, ఎదో తమాసాకి. అంతే... నువ్వు శాంతించు, మహిళాసంఘాలు గట్రాకి ఉప్పందించకు.
మీరు: ఐనా, మాలో మేము మాట్లాడుకుంటామని నీకే తలమాసినోడు చెప్పిండు.
నేను: కరెక్ట్ అక్కా.. నాకు తలమాసిందని నీకెట్టా తెలిసింది. పక్కింట్టోగాని వుంటావా ? అయ్యినా దీనికి ఒకడు చెప్పాల్నా అక్కా.. వందమందిలో, 46 మంది అమ్మాయిలుంటే, అందులో 40 మంది, ఫోన్ మాట్టాడుతుంటారు. ఆ మిగిలిన ఆరుగురు బాగోరనుకోండి, అది వేరే సంగతి. మిగిలిన, 53.5 మంది మగాళ్ళల్లొ, మహా అయ్యితే 15 మంది ఫోన్ తో మాట్లాడటంగాని, ఆడుకోటంగాని, ఏం నొక్కాలో తెలియక ఇబ్బందిపడటమో చేస్తుంటారు. ఒక ఏడుగురు, ఏడుగురు పోర్లతో మాట్లాడారనుకుందాం. మరి మిగిలిన, 33 మంది సంగతేంటి ?
మీరు: అవును, 53.5 ఎందుకొచ్చింది తమ్ముడు?
నేను: అదేంటక్కా.. మనతోపాటు ఈ లోకంలో ఇంకో లింగం నివసిస్తుంది కదా.. మర్చిపోతే.. మీరు మామీద మహిళా సంఘంతో దాడి చేస్తున్నట్టు, వాళ్ళు హిజ్రా సంఘంతో వచ్చేస్తారు జాగ్రత్త.
మీరు: నేను అమ్మాయిని కాదు. ఇదంతా వుళ్ళుళ్ళుళ్ళుళ్ళా.. వుత్తిదే, ఎదో తమాసాకి చెప్పా. లైట్ తీసుకో తమ్ముడు. ఈమాత్రం దానికి హిజ్రాలదాకా దేనికి చెప్పు.
నేను: నిజమా అన్నాయ్ ? భలే తమాసాలు చేసినావుగా ఇంతసేపు. నేను నిజమేగాబోళు అనుకున్నా. ఇక ఈ అమ్మాయిల ప్రవర్తనకి నిరసనగా, నేను ఒక ఐపాడ్ కొనేసుకుని, చెవిలో పెట్టేసుకుని, లోకంతో నాకు సంబంధంలేనట్టుగా బతికేస్తున్నా.
మీరు: ఆకెల్లి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా..
నేను: సామెత అర్దమయ్యిందిగాని, ఇంతకి ముళ్ళు ఎవరు.. నేనేగా ? ముహ్హహ్హా హహ్హా.. అంతేలే, ఇంత గొప్పగా నిరసన చేస్తే, దెబ్బకి ఎవ్వరైనా అల్లల్లాడిపోవాలి.
మీరు: అలా అర్దమయ్యిందా బాబు తమరికి.. మహానుభావులు. ఏదో రహస్యమంటే ఆత్రం ఆపుకోలేక చెప్పమన్నా.. ఇంకోమాలి, అడిగితే చెప్పెట్టుకుకొట్టేయ్యండి. ఆ విషాదకర సంఘటనేదో చెబితే, మా ప్రగాఢ బాధని వ్యక్తపరిచి, ఇంటికి దొబ్బేస్తాం.
నేను: అవునవును, విషాదమంటే గుర్తుకొచ్చింది.. yes manని అడుగుజాడల్లో నడవటం ఐతే మెదలుపెట్టాగాని, ఈ విషయం ఎవ్వరికి చెప్పలేదు. ఎంలేదు, చెబితే ఆడేసుకుంటారు ఎధవలు. అందుకే చెప్పలా..
ఎవ్వరు ఎం చెప్పినా నో అనకుండా, బాగానే ఒక రెండురోజులు మేనేజ్ చేశానండి. మూడో రొజు వచ్చేసింది. ఎప్పటిలానే, పొద్దునే సైకిలేసుకుని ఆఫీస్ కి బయల్దేరాను. మీకు చెప్పలేదు కదూ, నేను సైక్లిష్ట్ ని. రోజుకి 16kms సైక్లింగ్ చేసి ఆఫీసుకి వెళ్తా. అస్సలకి
మీరు: బాబు,ఆ సైకిల్ స్టోరి ఇంకోమాలి చెప్పొచ్చుగాని, ఈ రోజుకి దీన్ని కానివ్వు.
నేను: పెల్లుబీకుతున్న నా ఉత్సుకతని h2o, co2 రెండు కలిపి చల్లి ఆర్పేస్తున్నారు మీరు. సర్లె ఎం చేస్తాం.
మీరు: మీకు కెమిస్ట్రి బాగ వచ్చనుకుంటా.
నేను: యాక్ తూ.. నాకు తెలుగులో నచ్చని రెండే రెండు శాస్త్రలు..
మీరు: మాకు తెలుసు.. ఒకటి హింది శాస్త్రం, ఇంకోటి రసాయనిక శాస్త్రం.. అంతేకదా..
నేను: మీ శ్రార్దం. హింది శాస్త్రం కాదు, బాష. ఈ మాత్రం తెలియదూ, విడ్డూరం కాకపోతేను. సరే, అలా అడుతుపాడుతు ఆఫీస్ కి పోతుంటే, ఒక ఆటో వాడు.. NFS ఆడుతున్నంత ఫీలింగ్ ఇచ్చికుంటూ నన్ను క్రాస్ చేశాడు. నేను దెబ్బకి బిక్క చచ్చిపోయాను. నా పక్కన, డొక్కు స్కూటర్ మీద పోతున్న ఒక ముసలోడు అందరు ముసలొల్లలాగానే, హెల్మెట్ కొనుక్కొవాలని క్లాస్ పీకాడు. ఛీ, దీనమ్మ బతుకు.. నడి రోడ్డులో కూడా ఇంత క్లాస్ ఇప్పించుకున్న తరువాత, బతకటం వేస్టు అనుకున్నా. మళ్ళి, పగ తీర్చుకోకుండా చావటం ఎంటి నీచంగా అనేసి, ముసలోడినయ్యకా నేను కూడా ఇలానే ఓ కుర్రెధవకి క్లాస్ పీకి, అప్పుడు చద్దాం అని నిశ్చయించేసుకున్నా. బహుశా ఈ ముసలోడికి కూడా, వాడి వయస్సులో ఇలానే క్లాస్ పీకి వుంటారు.. వీడు ఇప్పుడు నాకు పీకాడు. ఇప్పుడు ఇంటికిపోయి ఆత్మహత్య చేసుకుంటాడెమో పాపం అనుకుంటూ, ఒక హెల్మెట్ కొట్టు వుంటే దారిలో, అక్కడికి వెళ్ళా. అబ్బో అబ్బో ఎన్ని రకాల హెల్మెట్లో.. ట్రాఫిక్ పోలిస్ చూస్తే పిచ్చెక్కిపోతాడు. సైకిల్ హెల్మెట్లు దొరుకుతాయా అని అడిగాను. వాడు, లోపలనుండి ఒక దుమ్ముపట్టిన ధర్మొకొల్ ముక్క బయటికి తీసి దుమ్ము దులుపుకుంటూన్నాడు. చెవుడుగామోళు అని, మళ్ళి అడిగాను. హింది వచ్చుంటే తెలుగురాదుగామోళు అనుకునేవాడిని కాని, హింది రాదుగా. కాబట్టి, వాడికి చెవుడే.
మీరు: పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతు, తనని ఎవ్వరు చూడటంలేదు అనుకుంటుందంటా.
నేను: ఎదొ మీకు సామెతలు వచ్చని, విఙానప్రదర్శన గాకపోతే.. నేను చెప్పిందానికి, మీరు చెప్పిందానికి పోలికెమైనావుందా అస్సలు?
మీరు: సొల్లు చెప్తే ఎలా కాలుతుందో నీకు చూపిద్దామాని, ప్రయత్నించా బాసు. బాగానే కాలినట్టే వుందే...
నేను: నాకు సభ్యసమాజం ముందు బూతులు రావు కాబట్టి బతికిపొయావ్ గాని.. కంట్రోల్.. కంట్రోల్.. కంట్రోల్

(సశేషం)
మూడు చెంప దెబ్బలు.


హలో హలో, కూసింత ఆగి అఘోరిస్తారా మాష్టారు? మీకు మరీ తొందరెక్కువేటండి. చెంప దెబ్బలు అన్నానో లెదో వెంటనే, అప్పుల అప్పరావు సినిమాలోకి జంపింగ్లు చేసేత్తుంటిరి. జల్సాలో కళ్యాణ్ బాబు (అందరి ఫ్యామిలీస్లొ బాబులున్నారు, మనకి ఒకడు కావాలని, చిరు అభిమానులు అట్టా పిల్చుకుంటార్లెండి) చెప్పినట్టు, ప్రతి పనికి ముందు ఒక 10 అంకెలు చొప్పున లెక్కెట్టుకోవాలి. thank god, నా ఎంసెట్ అప్పటికి ఈ రూల్ తెలియదు. లేకుంటేనా, సుర్రు సుమ్మయ్యెది. అయ్యినా, ఎర్రిబాగుళది కాబట్టి ఇలియానా (మనస్సుకి కొంచెం బాధగా వున్నా, అనక తప్పలేదు ఇల్లు. ఐనా, నిన్ను అనే హక్కు నాకులేదేంటమ్మా) పదంటే పదే లెక్కెట్టింది కాని, నేనైతెనా, పనిలో పని, ఎక్కాలు కూడా ప్రాక్టిస్ అవుతాయని, పది ఎక్కాలు చెప్పెసేవాడిని. పది ఎక్కాలు గడగడా చెప్పేస్తే, మనం గణితంలో ఎంత ప్రావిణ్యులమో పది మందికి తెలుస్తుంది కదా. హ్ము.. పది దాకా అంటే కష్టమెమోలే, మనక్కి ఏడో ఎక్కం సరిగ్గా వచ్చిచావదు. ఆరు దాక ఓకె, మెనేజ్ చెయ్యొచ్చు. ఎకసెక్కాలకి పోతే పరువుపోద్ది.

మీరు: ఇంతకి మూడు చెంప దెబ్బల గొడవేంటిరా ఆపదమోక్కులవాడా.. ?
నేను: జనరల్ గా, కోపం తెప్పించె పనులకి పెట్టింది పేరు నేను. అందుకె, ఇదిగో ముందుగా ఇప్పుడే చెప్పెస్తున్నా, కోపమొస్తే.. ఎద్దు, దున్న అని.. ఇంకా ఆపుకోలేని కోపమొచ్చిందనుకోండి, మోహన్ బాబు అని అయ్యినా తిట్టండిగాని.. చిరంజీవి తమ్ముడు అనకండి, నాకు మహ చెడ్డ కోపం.
మీరు: బోంగులే, మోహన్ బాబు! మేము అన్నది ఏడుకొండలవాడిని లే గాని, ముందు అసలు విషయం ఏడ్వు
నేను: ఒఒఒఓకే!

మా అమ్మ, మా నాన్నతో అప్పుడప్పుడు అంటు వుంటుంది, "కోపంవస్తె పిల్లల్ని నాలాగ, చెవి మెలిపెట్టి, వొంగపెట్టి, దభీ దభీమని నాల్గు తగిలించాలి.. వీపు విమానంమోత మోగించాలి. ఎంతలా అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోలేనన్నిసార్లు.. రెగ్యులర్ గా, విమానాల ల్యాండింగ్ జరగాలి. అలా చేతనవ్వకపోతే, మూసుక్కుర్చోవాలి ( మీ డౌట్ కరష్టే, మా నాన్నని మూసుక్కుర్చో అనేంత సీన్ మా అమ్మకి లేదులెగాని, నా ఫ్లోని చెడగ్గొట్టకండి మాష్టారు.) అంతేగాని, ప్రతి ఫిబ్రవరి 30వ రోజున భాదితే, వాళ్ళు లెక్కెసుకుంటారండి" అని. మాష్టారు! లెక్కలోచ్చు కదా అనేసి, ఆ తెలివిని ముమ్మరంగా వాడేసి, నా వయస్సు మూడుx లీఫు సంవత్సరం నాలుగేళ్ళకు ఒకసారిగాంద అని నాలుగు వేసేసి, 17 అనేసారనుకోండి, తొక్కమీద అడుగేసి, పప్పులో కాలేసినట్టే. అయ్యినా, ఇంకోమాలి నాకాడ లెక్కల ఊసు తేమాకండి బాబు..నాకస్సలికే అవి పరమ చిరాకు, వీకూను. మీ ఫేస్ చూస్తుంటే, ఫిబ్రవరి 30 పోలిక అర్ధమైనట్టులేదు. మళ్ళి చెప్తా.
"అలా కొట్టటం చేతనవ్వకపోతే, మూసుక్కుర్చోవాలి అంతేగాని, సెహ్వాగ్ కి మూడ్ వచ్చిన నాడు భాదినట్టు, అమావసకో పున్నానికో భాదితే, వాళ్ళు లెక్కెసుకుంటారండి, గుర్తుపెట్టేసుకుంటారు అని" ఇప్పటికైనా అర్ధమైందా ? లేక ఇంకోమాలి రిపిటిషన్ సెయ్యమంటారా ? ఇట్టాంటివి, నా దగ్గర బోల్డు ఎగ్జాంపుల్సు.. సర్లే, ఈ మాత్రం కూడా అర్ధం కానోళ్ళకి ఇంకోమాలి సెప్పి, నా టైయాన్ని వేష్టేజ్ సేసుకోను. ఈపాటికి ఎక్కేసుంటుంది, ఎవరు ఎవరిని మూడు చెంపదెబ్బలేసుకున్నారో.

మా అమ్మకి ఒకందుకు థ్యాంక్స్ చెప్పాలి, లేకుంటే మా నాన్నకి ఈ హితభోద మా చిన్నప్పుడు చేసివుంటే.. ఓరి నాయనో, మూడు చెంపదెబ్బలకి బదులు నూరు చెంపదెబ్బలు అని రాస్తుండేవాడినేమో ఇప్పటికి. హమ్మా హమ్మా త్రుటిలో ప్రమాదం తప్పేసింది. మా అక్క మాత్రం మహా లక్కీ, ఒక్క దెబ్బ కూడా లేకుండా తప్పించేసుకుంది, దొంగ మొహంది. ఐనా ఆవార, మా అమ్మ చేతిలో నాకంటే ఎక్కువే పడ్డాయిలే. హాస్టల్ మెస్ లొ, సర్వర్ తో సావాసం చేస్తె, మంగళవారం నాడు రెండు చపాతిలు ఎక్కువేసినట్టు, నేనేమో అమ్మ కూచి కదా, సో కొంచెంలొ కొంచెం బెట్టర్ గా తక్కువ దెబ్బలతో గట్టేక్కేశా. హా జింగిచకిచ.. హా జింగిచకిచా.
మీరు: మీ అమ్మ గయ్యళిలా వుందేంటి చెప్మా..
నేను: చెప్మా లేదు ఉప్మా లేదు. మమ్మల్ని మా అమ్మ కాకుండా పక్కింటోడి అమ్మమ్మ కోడుతుందా? ఒక్కొక్కళ్ళు ఒక్కో పాలసీ వాడతారు పిల్లల్ని పెంచటానికి. ప్రేమగా చెప్పి, బుజ్జగించటానికి చాల ఓర్పు కావాలి. ఇరవై ఏళ్ళకి, ఇద్దరు పిల్లలకి తల్లైతే, కుటుంబ భాధ్యతలన్ని నెత్తినపడితే, అత్తా మామలని సమాధానపరుచుకుంటు, చాకిరి చేస్తుంటే ఇంకెక్కడ ఓర్పు మిగులుతుంది చెప్పండి. ఇప్పడేమొ, చాలామందికి.. 25 ఏళ్ళకి పెళ్ళిళై, 30 ఏళ్ళకి పిల్లలు పుట్టినా, అత్తమామలని ఎక్కడో పెట్టేసి, ఇంట్లో పనులకి పనిమనిషి పెట్టుకున్నా, సరిగ్గా పెంచలేక చస్తున్నారు. మా అమ్మ కోపంవచ్చినప్పుడు కొట్టటం తప్ప, చానా చానా మంచిదండి. ఇప్పుడు, అప్పుడప్పుడు మమ్మల్ని కొట్టటం గుర్తుకు తెచ్చుకుని బాధపడుతుంది.. "ఎలా కొట్టగలిగానో మా బంగారుకొండలని అంటుంది". హలో, ఇక్కడ, గోల్డెన్ హిల్ అంటే మనమే!

మీరు: ఐనా గాడిదకి లేని బరువుమోత గుర్రానికెందుకు అని, మాకెందుకులే దురద..
నేను: గుడ్. ఇంకెని డౌట్స్. ఇంక + any = ఇంకెని. గుణ సంధి. సెప్పటం మరిచితిని, నాను సంధులయందునుయు వీకు. భయపడకండి, అప్పుడప్పుడు ఫ్లూకులు తగల్లోచ్చు. లేకుంటే తెలుగు ఎలా పాస్ అవ్వుతా చెప్పండి. గుణ సంధి అవ్వటానికి 52.32% ఛాన్స్ వుంది.
మీరు: నీకు హెచ్చవేతలే సరిగ్గా వచ్చి చావవు, probabilities కూడానా ?
నేను: అలా అనకండి, నా అంతరాత్మ ఘోషిస్తుందంట.. నిన్న కలలో కనపడి చెప్పింది. ఇంకెని డౌట్స్.
మీరు: యా.. మరి మీ నాన్న, అంత మంచోడు ఐతే, ఆ మూడు మాత్రం ఎందుకు పడ్డాయమ్మా అంటారా ?
నేను: అదే కదా మన టాలంట్. ఎంతోడికైనా, చక్రి గాడు సొంతగా చేసిన పాటల్ని 10000వాట్ సౌండ్ చెవిలో పెట్టి ప్లే చేస్తే వచ్చె చిరాకుకి, చికాకుని కూడా కలిపి.. తెప్పించగల టాలంట్ మనది. హుహ్హా హుహ్హాహ్హా.. "గురువుగారు! క్షమించండి" అనేసి, కాళ్ళమీద పడిపోయి అంతా నేర్చెసుకోవాలనుంది కదా? ఉద్యొగాలు ఊడినా పర్లేదు అనుకోనేవాళ్ళు సంప్రదించగలరు. జనాలందరు కలిసి నాలుగు తన్నినా పర్లేదు అనుకోనేవాళ్ళకి దీపావళి ప్రత్యేక తగ్గింపు అవకాశం!

ఐనా, నిజంగా నిజం చెప్తున్నానండి, నేను దైవంగా భావించె మా రిసెప్షనిస్ట్ మీద ఒట్టు. ఆ మూడుసార్లు మాత్రం తప్పు ఇసుమంత కూడా నాది లేదు.. "లేదు గాక లేదు యువరానర్" అని ఆనాడు గొంతు చించుకోటానికి అవకాశం లేకుండా, న్యాయస్థానం శిక్షని అమలుపరిచింది. నా స్టోరితో నేరము-శిక్ష అని ఒక సీరియల్ తీసి జనాల మీదకి వదులుదామనుకున్నా. ఈ లోపల మన సుసుసుసూపర్ స్టార్ క్రిష్ణగారు, సతిసమేతంగా అదె నామధేయంతో ఒక సినిమా తీసేశాడు, సచ్చినోడు. అది ఎంత పేద్ద హిట్ అంటే, నా సీరియల్ కి అదే పేరు పెట్టుకుంటే, జెమిని వీరాభిమానులు కూడా, మెదటిభాగాన్ని చూడరు.
మీరు: సర్లే, ఇంతకి నేరం ఎవరిది అంటావు ? మీ నాన్నదా ?
నేను: మీ మోహం, ఎక్కడైనా జడ్జి నేరాలు చేస్తాడా ?
మీరు: ఎమో, నీ సమాధానాలే అర్ధం అయ్యి చావట్లేదు. ఇంక ప్రశ్నలు కూడానా. తరువాతేంటొ చెబితే తరిస్తాం.
నేను: చెప్పకపోతే ?
మీరు: తంతాం.
నేను: తెలుగు భాషలో నాకు నచ్చని రెండే రెండు పదాలు. ఒకటి హింది. రెండోది తంతా.
అస్సలకి అన్నింటిలో విలన్ మా అక్కాయ్ అండి. మా అమ్మ దాన్ని ఎక్కువ కోడుతోందని గ్రహించి.. కుట్ర పన్ని, శాంతస్వభావుడైనా మా నాన్నని, నా మీదకు ఉసిగొల్పింది అని నా అనుమానం.
మీరు: నువ్వు నాటికలు ఎక్కువ చూస్తావనుకుంటా
నేను: సీరియల్స్ చూసేవాళ్ళని అడగండి కావల్సుంటే, ఇలా జరగటానికి ఎంత అవకాశం వుందో చెప్తారు. అయ్యినా నేను సీరియల్స్ చూడను. చూడకపోయినా కాని, తెలుసును. (మీకు ఒక రహస్యం.. ఎవ్వరికి చెప్పనని, గుండెలమీద క్రాస్ చేసుకోండి. చేసేసుకున్నారా? ఎంటంటే, మీరు సీరియల్స్ చూసినా, చూస్తాం అని చేప్పుకోకూడదు. ఎదో ఒక మంచి కామెడి సీరియల్ పేరు చేప్పెసి, "అది తప్ప ఇంకేం చూడం, వదినా" అని చెప్పుకోవాలి. మా అమ్మ మరి అదే చేస్తుందిగా),

సరే.. సన్నివేశం ఒకటి:
ప్రదేశం: మా పాత ఇల్లు. మా ఊరు(పోస్ట్), గుంటూరు జిల్లా.
సమయం: సూర్యుడు సీయు చెప్పే టైం.
చిన్నప్పుడు మా అక్కకి నాకు మధ్య నీళ్ళల్లొ పది రోజులు నానబెట్టిన గడ్డెసినా గుప్పుమనేది.
మీరు: అదేంటి, సహజంగా భగ్గుమనాలి కాదా ?
నేను: మీకు తెల్సియేడ్చింది అంతవరకే.. భగ్గుమంటే సౌండ్ ఎక్కువ అవుతుంది, అప్పుడు అందరు వచ్చేసి ఆడపిల్ల అని దాన్ని సపోర్ట్ చేసేత్తారు.. చేత్తే చేశారు, అలాంటివి సింగిల్ హండ్ గణేష్ కి అలవాటే. సపోర్టింగ్ తో పాటు ఆడపిల్లని కొట్టకూడదు అని ఒక క్లాస్ పీకిగాని వదలరు. నాకు తెలుగులో నచ్చని రెండె రెండు క్లాసులు. ఒకటి హింది క్లాసు, రెండోది ఈ పైన చెప్పిన క్లాసు. హమ్మా, అందుకే, ఆ అవకాశం చచ్చినా ఇయ్యకూడదు దేవుడోయ్. అదేంటో.. మా అమ్మకి తప్ప, ఒక్కళ్ళంటే, ఒక్కళ్ళకి కూడా నేను బుజ్జుపిల్లోడిని అని జాలి లేదు, కఠినులు. ఇంకా చెప్తారు, ఆడపిల్లంటే అష్ట లక్ష్మంటా, తొక్కేంకాదు. మగ పిల్లగాడంటే బ్రహ్మరాక్షసుడా మరి ?
మీరు: ఒరేయ్ పంది, ఆడపిల్లలని అపురూపంగా చూసుకోవాలిరా.. ఆడపిల్లలంటే..
నేను: చాలు.. ఇంక చాలు..(కుంభీనికర కుంభస్తగురు కుంభీవలయ పతి ఛత్రపతి. ఝంజాపవన గర్వాపహర వింధ్యాద్రి సమద్రుతి ఛత్రపతి. చండాప్రభల దోర్దందజిత ధూర్ధండభటతతి ఛత్రపతి. శత్రుప్రకర విఛ్ఛేదకద భీమాఅర్జున ప్రతి.) ఎన్నాళ్ళు ? ఎన్నేళ్ళు ? నాకు ఇవే సూక్తులు చెప్తారు. కావాలంటే హింది పాఠం చెప్పించుకుంటా. ఆడపిల్లల క్లాస్ మాత్రం వద్దు. క్రిష్ణవంశిగాడూ, గత రెండు సినిమాలు ఆడపిల్లల మీదే తీసుండు. నేనుకూడా సరేలే అని మారిపొయి, ఒక ఆడపిల్లని పట్టేసి, అపురూపంగా చూసుకుందామనుకున్నా. ప్రతోడు సూక్తులు సెప్పెటోడేగాని, అమ్మాయిని సూపెట్టి, ప్రోత్సహించేవాడు కరువయ్యిండు. తరువాత, మనకి ఈయ్యని పడవురా సిట్టి, అని నా తోటి పోరగాళ్ళు ఙనోదయం చేసి మళ్ళి నన్ను అరోగ్యవంతుడ్ని సేసిండ్రనుకోండి. ఇప్పుడు ఎంత ఉల్లాసంగా వున్నానో, ఎంత ఉత్సాహంగా వున్నానో. సర్లేండీ, ఆ భాగోతమంతా ఇప్పుడు ఎందుకుగాని..
మీరు: ఇక్కడ same feeling..
నేను: సరే.. మా అక్క మీద యుద్దప్రకటన చేసేప్పుడు, శబ్దాలు అవ్వకుండా వుండటానికి.. పొరపాటున ఒకవేళ అయ్యినా, ఎవ్వరికి వినపడకుండా వుండాటానికి చాలానే జాగ్రత్తలు తీసుకునేవాడిని. దగ్గర్లో మా అమ్మ వుంటే పర్లేదు, మన పార్టి కదా. ఇంకా, చిన్నపిల్లాడిని ఎడిపిస్తుందని, మా అక్కకే ఎక్కువ షంటింగ్ పడేది.
మా అమ్మకి నేనంటే ఎంత నమ్మకమంటే, రెడ్ హ్యండడ్ గా ఓసారి, మా అక్కని ఏడిపిస్తూ దొరికిపొయా.. అయ్యినాసరే, తన మద్దతుని ఎప్పుడు వెనక్కితీసుకోలేదు.
మీరు: తొక్కలో చెంపదెబ్బలు స్టోరి ఎవడికి కావాల్గాని, రెడ్ హ్యండడ్ గా దొరికిపోటమేదొ ఇంట్రస్టింగ్గా వుంది. అటేపు ఓ లుక్ వేసుకుందామా.
నేను: ఒఒఒఒఓకే..
ఉప సన్నివేశం ఒకటి
ప్రదేశం: ఇంకా మా పాత ఇల్లే.
సమయం: దీపాలుపెట్టె వేళ.
మీరు: అది పాతదయ్యినట్టుందీ....
నేను: అర్ధమైంది.. మీరు నానుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. సరే, అనగనగా ఓ లైట్స్ ఆన్ చేసే టైం. ఆరుబయట మంచం వేసుకుని, మా అమ్మకి, నేను మా అక్క చెరోవైపు పడుకున్నాం. మా అమ్మమీద కాళ్ళు చేతులేసి పడుకోటం అలవాటు అప్పట్లో మా ఇద్దరికి. కాళ్ళు చేతులు వేసే కాడ గొడవొచ్చింది. టిడిపివాడు కాంగ్రెస్ వాడికి టికెట్ట్ ఎందుకిస్తాడు చెప్పండి, సో, హక్కులు నాకే వచ్చేశాయి. మా అక్క సర్లేఅని, ఎందుకో adjust అయ్యింది. మనకి అది నచ్చలా. నేనే గెల్చినాసరే, అది ఉడుక్కోకపోటంతో నాకు ఎక్కడో కాలింది, శాడిజం అంటార్లెండి! దాని జబ్బమీద కసితీరా గిచ్చేశా. అనుకున్నట్టే "అమ్మా, వాడు నన్ను గిచ్చాడే!" అని ఎడుపందుకుంది అక్క. మా అమ్మ, మా నాన్న లా కాదు. నాకు సంజాయిషి చెప్పుకునే ఛాన్స్ ఇచ్చింది. నేనెమో అమాయకపు ఫేసొకటి వేసుకుని, "నా చేతులు నీమీదే వున్నాయిగామా, నేనెక్కడ గిచ్చుతాను చెప్పు. పైపెచ్చు అదే నన్ను గిల్లి అబద్దాలు చెప్తోంది. నేనే ఓర్చుకుంటున్నా ఇందాకట్నుంచి" అని సెంటిమెంట్ ప్లే చేశా. నా సెంటిమెంట్ షో సిల్వర్జూబ్లి హిట్ అయ్యిపోయి, మా అక్కకి చీవాట్లు పడ్డాయి. నేను పిచ్చ హ్యపీస్. ఒక ఐదు నిమిషాలకి నాలో "కమాన్, గుస గుస" గాడు లేచాడు. మళ్ళి అదే ట్రిక్ వాడాను. ఈసారి గొల్డెన్జూబ్లి అయ్యిపొయింది. హుహహ్హ్హా, హుహహ్హా.. పాతాలభైరవిలో యస్విఆర్ లా ఓ వికట్టహాసం చేసింది మనస్సు. గోల్డెన్ జూబ్లి తరువాత ఎముంటుందొ తెల్సుకోవాలనే కుతూహలంతో, మళ్ళి ప్రయత్నించా. బి గోపాల్ అంతోడికే, బాలయ్య వెనుకున్నా, మూడో ప్రయత్నం బ్రహ్మనాయుడు బెడిసికొట్టింది, మనమెంత. మన మూడో ప్రయత్నం కింద, గిచ్చినవెంటనే అక్కకి బదులు మా అమ్మ "అబ్బా" అంది. అప్పుడు అర్దమైంది. అక్కని గిల్లబోయి, మా అమ్మని గిచ్చానని. వెంటనే, కప్పిపుచ్చుకుందామని, "ఇదుగోమా, నా చేతులు ఇక్కడే వున్నయి.. కావాలంటే చూడు. గిచ్చింది నేను కాదు" అనేశా. అక్కేమో, "ఏమైందమ్మా, ఎందుకు అరిచావ్" అని అడిగింది. అప్పుడు అర్దమైంది మా అమ్మకి కంత్రి ఎవరొ. (ఉపసన్నివేశం ముగిసింది)
మీరు: వేష్ట్ ఫెలో. పల్లేటూళ్ళో బాస్కిన్ రాబిన్స్ పెట్టుకునే మొహము, నువ్వునూ.
నేను: చాల్లే.. సందు దొరికితే పందుల్లా దూరిపోతారు ప్రతోడు. అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయమ్మా, అది సహజం. ఆ మాత్రానికే..
మీరు: ఛస్, ఆపెయ్. కంపెనీలో కాఫీ ఫ్రీ అని, ఫ్లాస్క్ పట్టుకుపోయె యెర్రిమాలోకం. తొందరగా, అవ్వగొడితే.. సంతోషిస్తాం.
నేను: అంత కష్టపడుతూ, చదవటం దేనికంటా.. క్లోజ్ చేసి, పని చూసుకొవచ్చుగా.
మీరు: అబ్బ, ఛా.. మాకు తెల్వదని. నేనొసారి కమిట్ అయ్యితే నా మాట నేనే వినను.
నేను: హెయ్, సేమ్ పించ్. నేను కూడా అంతే. సినిమా ఎంత చెత్తలా వున్నా, మెదలెడితే అవ్వకుండా ఆపేదిలేదు.
మీరు: ...
నేను: ఆ విధంగా, మూడు ఫైట్లు, ఆరు గొడవలతో రోజులు గడుస్తుంటే.. ఓ నాడు, మా నాన్న వరండాలో కుర్చుని ఏవో నీళ్ళ స్కీం లెక్కలు చూసుకుంటున్నాడు. నేను, మా అక్క టివి చుస్తున్నాం. సింగిల్ గా వున్నప్పుడు మా మధ్య గొడవ రాకపోతే అశ్చర్యపోవాలిగాని, ఆ రోజు.. వింతలేమి లేకుండా, గొడవ స్టార్ట్ అయ్యింది. అమ్మ ఇంట్లొ లేదు, ఎదో పేరంటం ఐతే వెళ్ళినట్టుంది. అయ్యొ, నాన్న బయటె కుర్చున్నాడు, పరిస్థితులు ప్రతికూలంగా వున్నయే అని బాధవేసింది. బాధతోపాటు ఆలోచన కూడా వేసింది. కొడితే, కుయ్యమని శబ్దం కూడా రాకూడదు, అప్పుడే మనం సేఫ్. యాక్షన్ ఎంత సైలెంట్ గా వుంటే, అంత వైలెంట్ గా వుంటుంది (అతడు).
యేంటనే ఒక దిండు తీసి, ముఖానికి అడ్డుపెట్టి, నాలుగు గుద్దులు గుద్దా. దొంగ మొహంది, గిలగిలా తన్నేసుకుని సౌండ్స్ చేసేసింది. మరుక్షణం, నా చెంప ఛెల్లుమంది.

సన్నివేశం రెండు:
ప్రదేశం: శ్రీశైళం, పాతళ గంగకి పోయే తోవ.
సమయం: మధ్యాహ్నం మ్యాట్ని సినిమాకి టిక్కెట్లు ఇచ్చే టైం.
అప్పుడు ఓ చానా మందిమి కలిసి శ్రీశైళం ట్రిప్ వేశాం. మా మామయ్యవాళ్ళు, మేము, మా పెద్దనాన్నవాళ్ళు.. అభ్భొ, పెద్ద బ్యాచ్. పాతాళగంగలో మునిగితే పాపాలు పోతాయంటే, అందరం కలిసి చివరాఖరి రోజు అక్కడికి బయల్దేరాం. పాపాలతో పాటు, పుణ్యాలు కూడా పోతాయేమొ అని డౌట్ వచ్చింది. నోట్స్ పారేస్తె, తప్పు లెక్కలతో బాటు మంచి లెక్కలు కూడాపోతాయిగాంద, అది లెక్క. హా.. అయ్యినా, మనం పెద్దగా పుణ్యాలు ఎక్కడ చేసిచచ్చాం గనుక పోటానికి అనేసి, ధైర్యంగా స్నానం చేశా. మా తాత నా మొలతాడు పట్టుకుని, ఈతలొ ఎబిసిడిలు నేర్పించాడు. తిరిగు దారిలో మా వెహికల్ ట్రబుల్ ఇచ్చింది. బస్సులో వెళ్ళటమె అన్నాడు డ్రైవర్. మా పెద్దొళ్ళ బ్యాచ్ కి ఎం పనిపాటా లేదు, రోడ్డుకు ఆవలిపక్కకిపోయినుల్చున్నారు. యెర్ర బస్సోడు మనం ఎక్కేంతవరకు ఎక్కడికిపోడాని తెలియదేమో పాపం. అయ్యినా గోడవ అది కాదు. నా పుణ్యాన్ని పాతాళగంగ హరించేసినట్టుంది, అందుకే కష్టాలు మెదలయ్యయి అనుకున్నా. సర్లే, రేపటినుంచి మళ్ళి మంచి పనులు కొన్నిచేసేసి, పుణ్యాన్ని సంపాదించేద్దాం అని, మంచి పనుల లిస్టు తయారుచేసే పనిలో పడ్డా. ఇంతలో ఎదో ఎక్స్ ప్రెస్ వస్తోందంటా, పెద్దోళ్ళందరు మా పిల్ల బ్యాచ్ కి ఎవో సైగలు చేస్తున్నారు. మా అక్క, నాన్న పిలుస్తున్నాడు, ఎందో చూడు అని నన్ను రొడ్డు మధ్యలోకి తోసింది. ఎలాగు, రోడ్డు మధ్యలో వున్నాం కదా అని, పెద్దోళ్ళ వైపుకి పరిగెత్తుకుంటు వెళ్ళా, సైగల అర్దం తెల్సుకోటం కోసం. వెళ్ళినోడిని, ఎకాఎకినా మా నాన్న దగ్గరికే వెళ్ళా ఎందుకు సైగ చేస్తున్నారో అడుగుదామని . మళ్ళి ఛెల్లుమంది చెంప. ఇంకోపక్కన ఎందుకో, బస్సు డ్రైవర్, కండక్టర్.. అందరు కూడా నన్నే తిడుతున్నారు. అప్పుడు అర్దమైంది, రోడ్డు క్రాస్ చెయ్యొద్దని ఆ సైగల మీనింగ్ అని. ఎగ్జామ్ రాసివచ్చాక, సమాధానాలు తెల్సుకుని ఎం లాభం చెప్పండి.

సన్నివేశం మూడు:
ప్రదేశం: మా కొత్త ఇల్లు (పాతదానితో పోలిస్తే కొత్తదే), మళ్ళి మా ఊరే(పోస్ట్), గుంటూరు జిల్లా.
సమయం: గడియారంలో బ్యాటరి అయ్యిపొయింది.
నాకు తెలియకుండా మా అక్క, ఫ్రిజ్ లొ ధమ్సప్ తీసుకుని తాగేసింది. ఇంతకుమించి ఇంకెం కావాలి చెప్పండి, గొడవపడటానికి. మా ఒప్పందాన్ని కాలరాసి, తనొక్కతే తాగేస్తుందా హమ్మా హామ్మా, ఎంత ఘోరమైన తప్పిదం అది. అందుకే ఎవ్వరికి తెలియకుండా నాలుగు పీకా. తను కూడా తక్కువదేంకాదు, తన శక్తికోద్ది కొడుతుంది. అబ్బె, అయ్యినా అవి అస్సలకి, మన ఒంటికి ఆనవనుకోండి, బంగారు కొండని కదా. ఇంక అలకేసుకుంది, నేను కొట్టానని. మా నాయనమ్మొచ్చి, నన్ను తెగ తిట్టింది. నేను మా అక్క అలకని ఆస్వాదించె పనిలో బిజి. మా నాయనమ్మని లైటు తీసుకున్నా. ఇంట్లో మా అక్క అన్నం కూడా తినకుండా మా నాన్న కోసం తెగ వైటింగులు చేసేసింది. నేను ఆస్వాదిస్తునే వున్నాను. ఆఖరికి తన మొక్కులు ఫలించి నాన్న వచ్చెశాడు. లేనిపోని పితురీలు అన్ని చెప్పెసింది. ఎలాగో దాన్ని ముందు బుజ్జగించి, ఎవెవో తాయిలాలు ఇస్తానని చెప్పి, అలకపాన్పు దింపారు. అప్పట్లో, నేను చిన్నపిల్లాడినని, చిన్న చిన్న సరుకులకి అక్కని పంపేవారు. మా ఇంట్లొ ఆ రోజు, గడియారంలో బ్యాటరి అయ్యిపొయింది కదా.. వెళ్ళి కొనుక్కురమ్మన్నారు. "ఎప్పుడునేనేనా? ఊరికే వున్నాడుగా, ఈ సారికి వాడిని పంపండి" అంది. "ఓసి, దీనంకమ్మా.. నాకన్నా రెండేళ్ళు ఎక్కువ అనుభవంతో దిమ్మతిరిగే స్కెచ్ గీశావుగా. ఎదిఎమైనా సరే, ఈ కుట్రకి తలొగ్గకూడదు కామ్రెడ్!" అనుకున్నా మనస్సులో. ఆ యుద్దంలో మా మిత్రదేశం అయ్యిన మాత్రుమూర్తి కూడా, హ్యండ్ ఇచ్చింది. అయ్యినా తలొగ్గక, అర్ కె నారాయణమూర్తి రేంజ్ లో, అదే రేజ్ లో "యెర్రజెండెర్రజెండెన్నియ్యలో" అని వీరావేశంగా పోరాడాను.. ఫలితంగా చెంప పగిలింది.

తారాగణం: నేను, "శాంతస్వరూప" మా నాన్న, "ఏడుపు అభినేత్రి" మా అక్క (ఏడ్వటం బాగా నటిస్తుందని) మరియు మా ప్రియమైన అమ్మ.

మా నాన్న. ఆ మూడుసార్లు తప్పితే, ఇంకెప్పుడు మా మీన చెయ్యిలేపలేదు. ఏం అడిగినా, తన శక్తికి తగ్గ విధంగా సమకూర్చేవాడు.

ఇంక అక్క. కలిసి ఉన్నంతకాలం పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నా, తను ఇంటర్మీడియట్ కొసం, గుంటూరు హస్టల్ కి వెళ్ళినప్పుడు, తన లోటు ఎంటో అర్దమవ్వటం మెదలయ్యింది. అస్సలు, అక్కా తమ్ముళ్ళు ఎందుకు కొట్టుకుంటారో నా దగ్గర థీసిస్ వర్క్ వుందండి. అక్కకేమో పెద్దదాన్నని పొగరు. తమ్ముడికేమో అబ్బాయని పొగరు. ఇలాంటప్పుడే చిక్కు. కొట్టుకునే అక్కాతమ్ముళ్ళు కోకొల్లలు ఈ లోకంలొ. బలవంతుడు, బలహీనుడు కలిసివుంటే గొడవే వుండదు అస్సలు. అందుకే, అన్నా చెల్లెల్లు ప్రేమగా వుంటారు. ఏమంటారు ? వామ్మో, ఈ థియరిని తొందరగా కాపిరైట్ చేపించుకోవాలి బాబొయ్.

మా అమ్మ దగ్గరకి వస్తే, తను పిచ్చిది.. లేకపోతే తన థియరీని నాలాంటోడి మీద పని చేస్తుందనుకుంటుందా. తను కొట్టినవి, నాకు గుర్తు లేకపోటం ఎంటి? ఇక్కడ రాస్తే, బ్లాగ్ స్పాట్ వాడి స్పేస్ అయ్యిపొతుందని రాయటం లేదు అంతే. మొహం కడుక్కున్నేప్పుడు, మొహం మీద కొంచెం సబ్బు మిగిలిపోతే.. మళ్ళి బాత్ రూంలోకి లాక్కొచ్చి కొట్టి మరీ, కడిగించిన రొజులు బోలేడు. కొబ్బరి నూనె రాసుకునేప్పుడు, ఒక చుక్క కింద పడిందా, అంతే మటాష్. అన్నం తినేప్పుడు, టివిలో మంచి సీన్ వస్తుంది కదా అని, నమలటం మరిచిపోయామా, మా నోరు స్పీకర్లు, మా బుగ్గలు అమ్మ చేతిలో సౌండ్ కంట్రొల్స్ అయ్యిపొతాయి. పౌడర్ రాసుకుంటె, పొడలు పోడలుగా వచ్చిందంటే, నీ ఒళ్ళు కొంచెంసేపు అరువు ఇచ్చెయ్యటమె. ఎమైనా తేడా వచ్చిందంటె, నేను శారీరకంగా, మానసికంగా సిద్దమౌపోయెవాడిని, ఇంకాస్సెపట్లో వేడి వేడి వడ్డెన జరుగుతుంది అని. అదీ సంగతీ!
మీరు: హమ్మయ్యా.. ఇంక శుభం కార్డు వేసెయ్యమంటావా ?
నేను: మరి, నా గురించి చెప్పుకోలేదుగా..
మీరు: ఇప్పటిదాకా, నువ్వు చేసిందెమిటి బాబు.
నేను: హ్ము... ఐతె, ఓకె! శుభం.
వైరాగ్య జీవి - ప్రేమ పిపాసి

కోయిలలా నా కోసం పాటలు పాడే శ్రమపడనీలేదు.
గోరువంకనైనా, ఆలపించాను ప్రియరాగాలు.
కలువపూవులా నా రాకకై ఎదురుచూడనివ్వలేదు.
చంద్రవంకనైనా, అలుపులేక ప్రకాశించాను ఎన్నో యుగాలు.
క్రిష్ణమ్మలా నా వైపు పరిగెత్తె అవసరం రానీలేదు.
సాగరున్నైనా, ప్రళాయాలు లెక్కచేయక పడ్డాను నిను చేరే కష్టాలు.
ధరణిలా నా చుట్టు పరిభ్రమించె ఖర్మ పట్టనీలేదు.
భగభగ మండె భానున్నైనా, ఎదలో నిర్మించాను చలువ మందిరాలు.
చేదువిషంలా, నీవు ఇక లేవనె నిజం మింగుడుపడట్లేదు.
బీటలు వారిన చలువ మందిరంలో పాడుకుంటున్నాను వైరాగ్యగేయాలు.


కోయిలలా, నా కోసం పాడనక్కరలేదు.
గోరువంకనైనా, అర్పిస్తాను కుహుకుహు రావాల ఊయల.. నీ కోసం.
కలువలా, నా రాకకై వేచి, విసిగివేసారే పని లేదు.
చంద్రవంకనైనా, రోజంతా కాస్తాను ఆహ్లాదకర వెన్నెల.. నీ కోసం.
క్రిష్ణమ్మలా, నా వైపు పరిగెత్తి అలవనవసరం లేదు.
సాగరున్నైనా, నీకై వస్తాను, ప్రళయాన మునిగినా ఈ ఇల.. నీ కోసం.
భూమాతలా, నా చుట్టు పరిభ్రమించె శ్రమ లేదు.
సూర్యిడినైనా, నా హ్రుదయాన్ని చేస్తాను చలువ పందిళ్ళ కోవెల.. నీ కోసం.
లోకమంతా ఒకలా, నేనేంటో ఇలా ? అంతుచిక్కట్లేదు.
నేనెవ్వరినైనా, ఏమి చేసినా నీ కోసం.. నాకు ముఖ్యం నీ దరహాసం.. నువ్వే నా సర్వస్వం.




దాదాపుగా ఒక్కటే పదాలతో (కోన్నిచోట్ల ఉద్వేగాలు చెడకుండా వుండటానికి పర్యాయపదాలు వాడుట జరిగింది. ) రెండు వేర్వేరు భావాల్ని పలికించటం కోసం చేసిన ప్రయత్నం. మొదటిదానిలో ప్రేయసిని పోగొట్టుకున్న ఓ మనిషి ఆవేదన పలికితే, రెండోదానిలో ప్రేమలేఖ రాసిన కుర్రోడు కనిపిస్తాడు. ( అలోచించిన ఆశాభంగం. బహుశా, సొంత కవిత కి సొంత ముందుమాట రాసుకునే సొల్లుయెదవని ఇంతవరకు చూసివుండరు. ఇప్పుడే చుసి తరించండి, ఈ తొక్కలో బ్లాగుపోస్టులో. ప్చ్.. ఎం చేస్తాం చెప్పండి, దీన్ని నా వ్యక్తిగత బ్లాగులా వుంచుకుంటున్నా, కాబట్టి నా స్నేహితులు ఇచ్చిన compilements ని ఇలా పొందుపరచాల్సివస్తోంది. )

స్పందించె మనస్సు కి కవిత్వం కష్టం కాదని నా నమ్మకం. కవిత రాయటం తేలిక అని నేను చెప్పనుగాని, ప్రయత్నిస్తే కనీసం త్రుప్తి కలుగుతుంది. మీరు లోనైన భావోద్వెగాలని అలానే ఒడసిపట్టి, పదాల వేట మొదలేట్టండి.. నాలాంటి, ఇంగిలిపీసు నేర్చుకొబోయి అటు సరిగ్గా అదీ రాక, ఇటు వచ్చిన కాస్త తెలుగుని పోగోట్టుకున్న సంకరజాతి కంచర గాడిదలకి మొదట్లో కష్టంగానే వుంటుంది. కొంచెం కొంచెంగా మన భాషాపరిఙ్నానం ఙప్తికి వచ్చేస్తుందిలెండి. (నాకు ఇంకా రాలేదు :( )

one father is more than a hundred schoolmasters.



అవును, నేను గట్టిగా నమ్ముతాను. చదువుల్లో ఎక్కడా చెప్పని ఎన్నో విషయాలు మా నాన్న నుంచి నేర్చుకున్నాను. ఇప్పటికి, ఆయన చేసె పనులని గమనిస్తు వుంటాను. వాటినుంచి ఎదో ఒకటి నేర్చుకుంటూనే వుంటాను. ప్రతి పనిలోను ఆయనకంటూ ఒక ప్రత్యేకత వుంటుంది. బహుశ అనుభవం మీద వచ్చివుండోచ్చు, నాకైతే ఇంకా తెలియదు మరి. ఒక్కటిగా మీ ముందుంచె ప్రయత్నం. చిన్న గమనిక, నేను మా నాన్నకి గౌరవార్ధాలు వాడను. అది మా తల్లిదండ్రులు మాకిచ్చిన స్వేచ్చగా నేను భావిస్తున్నాను. అలా చెయ్యటం తప్పుగా పరిగణించెవాళ్ళు దీనిని చదవోద్దని ప్రార్దన.

చిన్నతనం నుంచి నాకు ప్రతి వస్తువు ఎలా పని చెస్తుందో తెలుసుకోవాలని కుతుహలం ఎక్కువ. ఇప్పటికి కూడా దేనైనా పట్టుకుంటే పూర్తిగా తెలుసుకోకుండా వదలను. నా ఈ గుణమే, నేను ఎంతో కొంత నేర్చుకోటానికి ఉపయొగపడిందని నా గట్టి నమ్మకం. దీనంతటికి ప్రేరణ, ఉత్సాహం మా నాన్న. ఇంట్లో ఎదైనా సరిగ్గా పని చెయ్యకపొతే, సొంతంగా బాగు చెయ్యటానికి ప్రయత్నిస్తాడు. అన్ని వుప్పదీసి, పక్కన వింతగా చుస్తూ కుర్చున్న నాకు, లోపల భాగాలన్ని చుపించేవాడు. ఇంట్లో స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లెయర్ లాంటి పనిముట్లు చాలా వుండేవండి. కాదేది కవితకి అనర్హం అన్నట్టు, స్పూన్స్ తో కూడా బోల్ట్స్ తీశెవారు. అలా చూస్తు, చూస్తూ పెద్దోడిని (వయస్సులో) అయ్యిపొయా. ఒక్కసారి తేలిస్తె వుప్పదీయకుండా మనం ఊరుకుంటామా, ఎదైనా ఐతే మా నాన్న వున్నాడు కదా అని ధైర్యంతో, అన్నింటిని బద్దలుకోట్టి మరీ, వాటి గురించి తెలుసుకున్నా. ఫాన్స్, మొటర్స్, మిక్సి, ప్రిడ్జ్, టివి, చెప్పులు, స్వెట్టర్స్, షు, కుక్కర్, హీటర్, బొమ్మ కారు, రైలు.. పాడైన దేన్ని వదలలేదు. నాలో ఇంజనీర్ కి పునాదిరాళ్ళు ఆ అనుభవాలు.

ఆయన దగ్గరినుంచి చాలా నేర్చుకోవాలని వుంటుంది. ముఖ్యంగా, ఎవరితో ఎలా మసులుకోవాలొ, ఎం మాట్లాడొచ్చో, ఎం మాట్లాడకూడదో, ఎలా పలకరించాలో బాగా తెలుసును. మానవ సంబందాలకి మొదట ప్రాముఖ్యతనిస్తారు. చుట్టాలు, వాళ్ళతో సంబంధబాందవ్యాల ఆవశ్యకత ఆయనికి బాగా తెలుసు. ఎవరికైనా పుష్కలంగా లభ్యమయ్యె వాటి విలువ తెలియకుండాపోతుందంటారు. మా నాన్నకి అంతమంది బంధువులున్నా వారి అవసరం ఎలా తెల్సివచ్చిందో! బంధువులు ఎంత అవసరమో నాకు మా అమ్మ,నాన్న వల్లే తెలిసివచ్చింది. చుట్టాలనే కాదండి, ఊర్లో అందరికి మా నాన్న తల్లో నాలుక. అణా పైసా ప్రతిఫలం ఆశించకుండా, నా అనుకుంటే, ఎంతటి సాయమైనా ( అది ధనమైనా, వస్తువైనా, సలహా అయ్యినా, పలుకుబడి వాడి పని చేపించాలన్నా) క్షణాలలో చేసేస్తారు. ఒకటి రెండు అంటే ఉదహరణ కింద చెప్పొచ్చుకాని, అలవాటు కింద చేసేవాటిని ఎన్నని చెప్పగలం. పరాయివాళ్ళకి, అవసరంలో వున్నవాళ్ళకి అడిగిందేతరువుగా ఎంతమంది సహాయం చేస్తున్నామండి ? సహయం సంగతి తరువాత, మొదట పక్కోడి కష్టాలు వినటానికి కూడా మనకి సమయాభావం. నేను మా నాన్నలా వుండటానికి ప్రయత్నిస్తున్నా.

ఇక ఊర్లోవాళ్ళకోసమే ఇంత చేశెవాడికి, ఇంట్లొ భార్య, బిడ్డలకి చెయ్యకుండా ఎలా వుంటాడు. ఆయన చేయ్యకపోయినా, ఊర్లో జనాలు అయనమీద అభిమానంతో చెయ్యగలరు. అయ్యినా, మాకు ఆ పరిస్థితి ఏనాడు పట్టనివ్వలేదులెండి మా నాన్న. ఒకత్తె ఆడపిల్ల కావటం మూలాన, మా అక్క అంటే వల్లమాలిన ప్రేమ. నేను మాత్రం మా అమ్మ తట్టు చిన్నప్పటిసంధి. నాన్న దగ్గర ముక్కుసూటి వ్యవహరం మనది అప్పుడంతా. నేను మరీ చిన్నాడినప్పుడు, చనువు తక్కువ. మా అక్కకి మాత్రం మొదటినుంచి విపరీతమైన చనువు. తరుచుగా పెద్ద పెద్ద బాతాఖానిలు వేస్తుంటారు, ఇప్పటికి కూడా. వాటిళ్ళొకి, నేను అమ్మ నిషేదం. గంట తరువాత ఎం జరుగుతుందో, పిచ్చాపాటి కాస్త మహా కురుక్షేత్రం అయ్యిపొతుంది. నేను, అమ్మ రంగప్రవేశం చెయ్యాల్సివస్తుంది. వాళ్ళిద్దరు ఎక్కువసేపు మాట్లాడుకుంటున్నారంటే మా అమ్మకి పిచ్చ భయం, ఇప్పటికికూడా. చివరిగా గేలిచేవాళ్ళు పాండవులు కాబట్టి, మా అక్క పాండవురాలు. తప్పుఒప్పుల సమస్య లేదు ఇక్కడ. ఎందుకంటే, మరుసటిరోజు మా అక్కకి ఇష్టమైన టిఫిన్ కొనుక్కొచ్చి, బుజ్జగించి, బామాలి, మంచి చేసుకుంటాడు కాబట్టి మా నాన్న. మళ్ళి రెండు-మూడు రోజులకి ఇంకో బాతాఖానికి సిద్ధమైపోతారు ఇద్దరు. మళ్ళీ అమ్మకి గుండె గుభేల్మంటుంది. అంతులేని మధురమైన కథ.

పల్లేటూరులొ వ్యవసాయం చేసుకుంటున్నా కూడా, కోత్త తరం అలోచనసరళిని అర్ధం చేసుకోగలిగాడు. మా చదువుల విషయంలో ఎనాడు రాజిపడలేదు. కాలేజిల చుట్టు తిరిగేవాడు, విశ్లేషించెవాడు చేతనైనంతవరకు, తెలియకపొతే నలుగురిని అడిగి తెలుసుకుని, అంతా బాగుందని నిర్దారణ చేశాకనే, చేర్పించాడు. ఆడపిల్లకి పల్లెటూరులొ 20యేళ్ళు రాగానే పెళ్ళిచెస్తుంటే, తను మాత్రం మా అక్క చేత MBA చేపించాడు.
నాలుగు మాటల్లో నేను


కష్టాల్లో వున్నవాళ్ళని చూసి స్పందించటం దానికి తెలుస్సు.
కూసేపటికే, తన స్పందనని తనే మరిచె హ్రుదయం.
నమ్మిన సిద్దాంతాలని, విలువలని పాటించమని ఒత్తిడి చేసే మనస్సు.
అప్పుడప్పుడు నా కట్టుబాట్లు నేనే దాటక తప్పని జీవితం.
సంప్రదాయాలని కాపాడి, తరువాత తరాలకి అందివ్వాలని తపన, తపస్సు.
తపన తప్పితే.. అలోచన లేని, దారి తోచని యవ్వనం.
ఇవన్నిఆలోచించే అనుభవం, ఙానం నాకు లేవని గుర్తుచేసే వయస్సు.
జుట్టు ఊడటం మినహాయించి, నష్టమేమిటని అయోమయం!

సలహాలు ఇచ్చే అంత పెద్దవాడిని కాకపొయినా, మంచిని పంచుకోవాలనే ఉద్దేశ్యంతో రెండు సలహాలు:
* మన పక్కవాడు బాధలో వున్నాడంటే, తప్పు మనలో కూడా వున్నట్టు. చేతనైన సహాయం చేయ్యండి, పక్కవాడి కన్నీళ్ళు తుడవండి.
* ఆరోగ్యం మహా భాగ్యం. నిర్లక్ష్యం తగదు. రెండు రోజులకి ఒకసారైనా, పనులన్ని పక్కనపెట్టి, వ్యాయమం చెయ్యండి.
నేస్తమా, నీ తోడు కావాలి


తెలుసుకోవాలని వుంది, నాకు ఎం జరుగుతోందో.
అర్ధంకాకుంది, నాలో ఈ మార్పు ఏమిటో.
అంతు చిక్కకుంది, నీతో మాట్లాడాలని ఆరాటమెందుకో.
దిక్కు తోచకుంది, ఈ స్ధితి నుంచి విముక్తి ఎప్పుడో.
ఇదంతా నీకు చెప్పాలని వుంది, ఎం అవుతుందో.
భయమేస్తుంది, చెప్తే నీ స్నేహాన్ని కోల్పోతానేమో.


కంటూనే వున్నా ఊహలు రోజంతా.. అంత మొండెంటో నీకు, నా కళ్ళని వదిలెళ్ళకుండా.
ఎక్కడ చూసినా నువ్వే,
ఎవ్వరిని చూసినా నువ్వే.
నా అవేదనంతా నువ్వే.
అందుకే.. కంట తడి పెట్టక బతుకుతున్నా, కళ్ళనుంచి నిను జారనీకుండా.

చెప్పటానికి ఎన్నో ఊసులు మదినిండా, నీ చెంత మూగబోతున్నా మాట్లాడకుండా.
చెప్పాలని బాధ,
చెప్పటానికి బాధ,
అఖరికి చెప్పలేదని బాధ.
ఎంత బాధైనా సరే.. దాచుకుంటా మధురంగా పదిలంగా, మర్చిపోకుండా.

పోందాలనుకున్నా నను కలవరపరిచిన నీ నవ్వునంతా.. స్వార్దం వెనుక ఇష్టమని తెలుసుకో, అపార్ధం చేసుకోకుండా.
నీ చిరునవ్వులు చూస్తూ వుండాలి,
ఆ నవ్వుల కారణమవ్వాలి.
నీ మోములొ సంతోషం నేకావాలి.
పిచ్చివాడిననుకుంటావేమో.. ఎలా వుండగలను చెప్పు, నీ నవ్వు చూసి పరవశించకుండా.

నడవాలనుకున్నా నీ వెంట ఏడు జీవితకాలాలంతా.. ఎలా వుండగలిగావో, నా మనస్సు అర్ధం చేసుకోకుండా.
కలిసి నడావలని ఆశ.
నీతో బతుకుబండి నడపాలని ఆశ.
నా ఆశలు నిజం చేస్తావని ఆశ.
నా దారిలో పల్లాలు ఉంటాయెమో.. పరుస్తా పారిజాతాలు, నీ కాళ్ళు కందకుండా.

ఆరాటపడుతున్నా పంచటానికి నా ప్రేమనంతా.. కేవలం నేస్తాన్ని అంటావేమో, స్వీకరించకుండా.
పెరుగుతూనే వుంది నాలో ప్రేమ.
దాన్ని ఒంటరిగా మోయ్యలేను సుమ.
రెక్కలు కట్టుకు వచ్చి, ప్రేమభారాన్ని పంచుకోమా.
శూన్యమైపోతుందేమో ఈ జీవితం, నువ్వు లేకుండా, నీ తోడు లేకుండా.
  • Interesting Articles

    About Me

    నా పూర్తి పేరు నాగేశ్వరరావు మన్నెం. మా నాన్న బుజ్జిగా అంటాడు. మా అమ్మేమో, బంగారుకొండ/అమ్మా అని పిలుస్తుంది. మా అక్క, బావ.. ఇంజినిరింగ్ ఫ్రెండ్స్ వచ్చెసి, నాగాస్ అంటారు. కాలేజి లొ నాగేశ్వర్ అని, ఆఫీస్ లొ నాగేశ్వరా అని, పిలిపించుకుంటా. ఇంకా కొంతమంది నాగేష్ అని, MNR అని, అబ్బాయ్ అని, ఒరేయ్ అని ఎవరికి అనుగుణంగా వాళ్ళు పిలుచుకుంటారు. మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు పిలిచుకోవచ్చు. పిలిస్తే పలుకుతా :)

    Stats


    View My Stats