one father is more than a hundred schoolmasters.



అవును, నేను గట్టిగా నమ్ముతాను. చదువుల్లో ఎక్కడా చెప్పని ఎన్నో విషయాలు మా నాన్న నుంచి నేర్చుకున్నాను. ఇప్పటికి, ఆయన చేసె పనులని గమనిస్తు వుంటాను. వాటినుంచి ఎదో ఒకటి నేర్చుకుంటూనే వుంటాను. ప్రతి పనిలోను ఆయనకంటూ ఒక ప్రత్యేకత వుంటుంది. బహుశ అనుభవం మీద వచ్చివుండోచ్చు, నాకైతే ఇంకా తెలియదు మరి. ఒక్కటిగా మీ ముందుంచె ప్రయత్నం. చిన్న గమనిక, నేను మా నాన్నకి గౌరవార్ధాలు వాడను. అది మా తల్లిదండ్రులు మాకిచ్చిన స్వేచ్చగా నేను భావిస్తున్నాను. అలా చెయ్యటం తప్పుగా పరిగణించెవాళ్ళు దీనిని చదవోద్దని ప్రార్దన.

చిన్నతనం నుంచి నాకు ప్రతి వస్తువు ఎలా పని చెస్తుందో తెలుసుకోవాలని కుతుహలం ఎక్కువ. ఇప్పటికి కూడా దేనైనా పట్టుకుంటే పూర్తిగా తెలుసుకోకుండా వదలను. నా ఈ గుణమే, నేను ఎంతో కొంత నేర్చుకోటానికి ఉపయొగపడిందని నా గట్టి నమ్మకం. దీనంతటికి ప్రేరణ, ఉత్సాహం మా నాన్న. ఇంట్లో ఎదైనా సరిగ్గా పని చెయ్యకపొతే, సొంతంగా బాగు చెయ్యటానికి ప్రయత్నిస్తాడు. అన్ని వుప్పదీసి, పక్కన వింతగా చుస్తూ కుర్చున్న నాకు, లోపల భాగాలన్ని చుపించేవాడు. ఇంట్లో స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లెయర్ లాంటి పనిముట్లు చాలా వుండేవండి. కాదేది కవితకి అనర్హం అన్నట్టు, స్పూన్స్ తో కూడా బోల్ట్స్ తీశెవారు. అలా చూస్తు, చూస్తూ పెద్దోడిని (వయస్సులో) అయ్యిపొయా. ఒక్కసారి తేలిస్తె వుప్పదీయకుండా మనం ఊరుకుంటామా, ఎదైనా ఐతే మా నాన్న వున్నాడు కదా అని ధైర్యంతో, అన్నింటిని బద్దలుకోట్టి మరీ, వాటి గురించి తెలుసుకున్నా. ఫాన్స్, మొటర్స్, మిక్సి, ప్రిడ్జ్, టివి, చెప్పులు, స్వెట్టర్స్, షు, కుక్కర్, హీటర్, బొమ్మ కారు, రైలు.. పాడైన దేన్ని వదలలేదు. నాలో ఇంజనీర్ కి పునాదిరాళ్ళు ఆ అనుభవాలు.

ఆయన దగ్గరినుంచి చాలా నేర్చుకోవాలని వుంటుంది. ముఖ్యంగా, ఎవరితో ఎలా మసులుకోవాలొ, ఎం మాట్లాడొచ్చో, ఎం మాట్లాడకూడదో, ఎలా పలకరించాలో బాగా తెలుసును. మానవ సంబందాలకి మొదట ప్రాముఖ్యతనిస్తారు. చుట్టాలు, వాళ్ళతో సంబంధబాందవ్యాల ఆవశ్యకత ఆయనికి బాగా తెలుసు. ఎవరికైనా పుష్కలంగా లభ్యమయ్యె వాటి విలువ తెలియకుండాపోతుందంటారు. మా నాన్నకి అంతమంది బంధువులున్నా వారి అవసరం ఎలా తెల్సివచ్చిందో! బంధువులు ఎంత అవసరమో నాకు మా అమ్మ,నాన్న వల్లే తెలిసివచ్చింది. చుట్టాలనే కాదండి, ఊర్లో అందరికి మా నాన్న తల్లో నాలుక. అణా పైసా ప్రతిఫలం ఆశించకుండా, నా అనుకుంటే, ఎంతటి సాయమైనా ( అది ధనమైనా, వస్తువైనా, సలహా అయ్యినా, పలుకుబడి వాడి పని చేపించాలన్నా) క్షణాలలో చేసేస్తారు. ఒకటి రెండు అంటే ఉదహరణ కింద చెప్పొచ్చుకాని, అలవాటు కింద చేసేవాటిని ఎన్నని చెప్పగలం. పరాయివాళ్ళకి, అవసరంలో వున్నవాళ్ళకి అడిగిందేతరువుగా ఎంతమంది సహాయం చేస్తున్నామండి ? సహయం సంగతి తరువాత, మొదట పక్కోడి కష్టాలు వినటానికి కూడా మనకి సమయాభావం. నేను మా నాన్నలా వుండటానికి ప్రయత్నిస్తున్నా.

ఇక ఊర్లోవాళ్ళకోసమే ఇంత చేశెవాడికి, ఇంట్లొ భార్య, బిడ్డలకి చెయ్యకుండా ఎలా వుంటాడు. ఆయన చేయ్యకపోయినా, ఊర్లో జనాలు అయనమీద అభిమానంతో చెయ్యగలరు. అయ్యినా, మాకు ఆ పరిస్థితి ఏనాడు పట్టనివ్వలేదులెండి మా నాన్న. ఒకత్తె ఆడపిల్ల కావటం మూలాన, మా అక్క అంటే వల్లమాలిన ప్రేమ. నేను మాత్రం మా అమ్మ తట్టు చిన్నప్పటిసంధి. నాన్న దగ్గర ముక్కుసూటి వ్యవహరం మనది అప్పుడంతా. నేను మరీ చిన్నాడినప్పుడు, చనువు తక్కువ. మా అక్కకి మాత్రం మొదటినుంచి విపరీతమైన చనువు. తరుచుగా పెద్ద పెద్ద బాతాఖానిలు వేస్తుంటారు, ఇప్పటికి కూడా. వాటిళ్ళొకి, నేను అమ్మ నిషేదం. గంట తరువాత ఎం జరుగుతుందో, పిచ్చాపాటి కాస్త మహా కురుక్షేత్రం అయ్యిపొతుంది. నేను, అమ్మ రంగప్రవేశం చెయ్యాల్సివస్తుంది. వాళ్ళిద్దరు ఎక్కువసేపు మాట్లాడుకుంటున్నారంటే మా అమ్మకి పిచ్చ భయం, ఇప్పటికికూడా. చివరిగా గేలిచేవాళ్ళు పాండవులు కాబట్టి, మా అక్క పాండవురాలు. తప్పుఒప్పుల సమస్య లేదు ఇక్కడ. ఎందుకంటే, మరుసటిరోజు మా అక్కకి ఇష్టమైన టిఫిన్ కొనుక్కొచ్చి, బుజ్జగించి, బామాలి, మంచి చేసుకుంటాడు కాబట్టి మా నాన్న. మళ్ళి రెండు-మూడు రోజులకి ఇంకో బాతాఖానికి సిద్ధమైపోతారు ఇద్దరు. మళ్ళీ అమ్మకి గుండె గుభేల్మంటుంది. అంతులేని మధురమైన కథ.

పల్లేటూరులొ వ్యవసాయం చేసుకుంటున్నా కూడా, కోత్త తరం అలోచనసరళిని అర్ధం చేసుకోగలిగాడు. మా చదువుల విషయంలో ఎనాడు రాజిపడలేదు. కాలేజిల చుట్టు తిరిగేవాడు, విశ్లేషించెవాడు చేతనైనంతవరకు, తెలియకపొతే నలుగురిని అడిగి తెలుసుకుని, అంతా బాగుందని నిర్దారణ చేశాకనే, చేర్పించాడు. ఆడపిల్లకి పల్లెటూరులొ 20యేళ్ళు రాగానే పెళ్ళిచెస్తుంటే, తను మాత్రం మా అక్క చేత MBA చేపించాడు.
0 Responses
  • Interesting Articles

    About Me

    నా పూర్తి పేరు నాగేశ్వరరావు మన్నెం. మా నాన్న బుజ్జిగా అంటాడు. మా అమ్మేమో, బంగారుకొండ/అమ్మా అని పిలుస్తుంది. మా అక్క, బావ.. ఇంజినిరింగ్ ఫ్రెండ్స్ వచ్చెసి, నాగాస్ అంటారు. కాలేజి లొ నాగేశ్వర్ అని, ఆఫీస్ లొ నాగేశ్వరా అని, పిలిపించుకుంటా. ఇంకా కొంతమంది నాగేష్ అని, MNR అని, అబ్బాయ్ అని, ఒరేయ్ అని ఎవరికి అనుగుణంగా వాళ్ళు పిలుచుకుంటారు. మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు పిలిచుకోవచ్చు. పిలిస్తే పలుకుతా :)

    Stats


    View My Stats